Monsoon brings Heavy Rainfall
Heavy Rainfall : నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. (Monsoon brings Heavy Rainfall) ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జులై 6వతేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఐఎండీ ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది.
Amarnath Yatra : అమరనాథ్ యాత్రకు మూడంచెల అధునాతన భద్రత
గుజరాత్ రాష్ట్రంలో సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. గుజరాత్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల సాధారణ జీవనానికి అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే 24 గంటలపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.
Neeraj Chopra : నీరజ్ చోప్రాను అభినందించిన ప్రధాని మోదీ
ఛత్తీస్ ఘడ్,మధ్యప్రదేశ్, విదర్బ ప్రాంతాల్లో ఈ నెల 5వతేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోవా, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. కేరళ, కర్నాటక, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.