US President Joe Biden gifts : మోదీకి జో బిడెన్ టీషర్ట్ బహుమతి

భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేక టీషర్టును బహుమతిగా అందజేశారు.కృత్రిమ మేధస్సులో ఇండియా, అమెరికా దేశాలు పురోగతి సాధించాయనే కోట్ తో కూడిన టీషర్టును బిడెన్ నుంచి చిరునవ్వుతో మోదీ అందుకున్నారు....

US President Joe Biden gifts : భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేక టీషర్టును బహుమతిగా అందజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోట్ తో కూడిన ఎర్రరంగు టీషర్టును బిడెన్ మోదీకి ఇచ్చారు. కృత్రిమ మేధస్సులో ఇండియా, అమెరికా దేశాలు పురోగతి సాధించాయనే కోట్ తో కూడిన టీషర్టును చిరునవ్వుతో మోదీ అందుకున్నారు. (special t-shirt to PM Modi)

Sundar Pichai Meets PM Modi : గుజరాత్‌లో గూగుల్ ఫిన్‌టెక్ సెంటర్

‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికా-ఇండియాలదే భవిష్యత్తు! మన రెండు దేశాలు బలంగా ఉన్నాయి, మనం సహకారంతో పని చేసినప్పుడు మన గ్రహం మెరుగ్గా ఉంటుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు ప్రధానమంత్రి మోదీ ఫెడెక్స్, మాస్టర్ కార్డ్, అడోబ్‌తో సహా అగ్రశ్రేణి సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా వివిధ సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలు, పెట్టుబడులు, తయారీ గురించి ప్రధాని పారిశ్రామికవేత్తలతో చర్చించారు. తర్వాత యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ల అధికారిక విందులో పాల్గొన్నారు.

Narendra Modi : అమెరికా పర్యటనలో ‘నాటు నాటు’ గురించి మోదీ వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

అమెరికా పర్యటనలో 3వ రోజున ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఉక్రెయిన్ యుద్ధం, ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, ఇండో-యూఎస్ సంబంధాల అంశాలు చర్చించారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈజిప్ట్‌కు వెళ్లే ముందు వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో భారతీయ కమ్యూనిటీ సభ్యులను ఉద్ధేశించి ప్రసంగించారు.

ట్రెండింగ్ వార్తలు