Sundar Pichai Meets PM Modi : గుజరాత్‌లో గూగుల్ ఫిన్‌టెక్ సెంటర్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు....

Sundar Pichai Meets PM Modi : గుజరాత్‌లో గూగుల్ ఫిన్‌టెక్ సెంటర్

మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ

Sundar Pichai Meets PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీని సుందర్ పిచాయ్ కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు.(PM Modi US Visit 2023) భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.

PM Modi US Visit : బెంగళూరు, అహ్మదాబాద్‌లలో కాన్సులేట్లు ఏర్పాటు : మోదీ పర్యటన వేళ అమెరికా కీలక ప్రకటన

గూగుల్ తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను గుజరాత్‌లో ప్రారంభించనున్నట్లు కంపెనీ బాస్ ప్రకటించారు. (Will Open Google Fintech Centre) మోదీ ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్‌షిప్ క్యాంపెయిన్ అయిన డిజిటల్ ఇండియా కోసం ప్రధాని దార్శనికతను కూడా ఆయన ప్రశంసించారు.

Modi no.1: మళ్లీ మళ్లీ మోదీనే.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్‭గా ప్రధాని మోదీ

‘‘అమెరికాలో చారిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని నేను ప్రధానితో చెప్పాను. గుజరాత్‌లోని(Gujarat) గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటిస్తున్నాను’’ అని పిచాయ్ వివరించారు.

Yash : యశ్ నెక్స్ట్ సినిమా ఆమె దర్శకత్వంలో? ఈసారి లవ్ స్టోరీతో..

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో ఉంది. సుందర పిచాయ్‌తో పాటు, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ప్రధాని మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌లను కలిసిన వ్యాపారవేత్తల్లో ఉన్నారు.