PM Modi US Visit : బెంగళూరు, అహ్మదాబాద్‌లలో కాన్సులేట్లు ఏర్పాటు : మోదీ పర్యటన వేళ అమెరికా కీలక ప్రకటన

ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi US Visit : బెంగళూరు, అహ్మదాబాద్‌లలో కాన్సులేట్లు ఏర్పాటు : మోదీ పర్యటన వేళ అమెరికా కీలక ప్రకటన

Modi US Tour 2023 US new consulates india

Updated On : June 23, 2023 / 6:54 PM IST

PM Modi US Visit 2023 : ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న వేళ అమెరికా అధ్యక్ష కార్యాలయం (White House official) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు (Bengaluru),అహ్మదాబాద్ (Ahmedabad)లలో రెండు కొత్త కాన్సులేట్లు (new US consulates) ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం సీనియర్ అధికారి ప్రకటించారు. 2022లో భారతీయ విద్యార్ధుల (Indian students)కు అమెరికా (America) రికార్డు స్థాయిలో 12,5000 వీసాలు (US Visas) జారీ చేసిందని తెలిపారు.

PM Modi US Tour : 30 ఏళ్ల క్రితం ఓ సామాన్యుడిలా వైట్ హౌస్‌ను బయట నుంచి చూసా: ప్రధాని మోదీ

భారత్‌ (India) సియాటెల్‌(Seattle)లో కాన్సులేట్‌ను ఆరంభిస్తుంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గురువారం ఈ ప్రకటన వెలువడటం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం అమెరికాలోని భారత్ కు చెందిన కాన్సులేట్ కార్యాలయాలు వాషింగ్టన్‌ రాయబార కార్యాలయంతోపాటు న్యూయార్క్(New York)‌, శాన్‌ఫ్రాన్సిస్కో(San Francisco), షికాగో (Chicago), హ్యూస్టన్ (Houston)‌, అట్లాంటా (Atlanta)లో అంటే ఐదు చోట్ల ఉన్నాయి.

కాగా..భారత్‌లో అమెరికాకు ఢిల్లీ (Delhi)లోని రాయబార కార్యాలయంతో పాటు ముంబయి (Mumbai), కోల్‌కతా (Kolkata), చెన్నై(Chennai), హైదరాబాద్‌ (Hyderabad)లలో కాన్సులేట్లు ఉన్నాయి. ఈ క్రమంలో మోదీ (Modi) పర్యటనలో చర్చల ఫలితంగా భారత్ లో మరో రెండు కొత్త కాన్సులేట్లు ఏర్పాటు కానున్నాయి.