Bengal Panchayat Election Result : భారీ బందోబస్తు మధ్య బెంగాల్ పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య మంగళవారం పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పలు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది....

Counting begins heavy security

Bengal Panchayat Election Result : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య మంగళవారం పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పలు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. (Counting of votes begins amid heavy security) బెంగాల్ పంచాయతీ ఎన్నికల పర్వంలో జరిగిన హింసాకాండలో మొత్తం 33 మంది మరణించారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ 80.71 శాతం జరిగింది.

IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీవర్షాలు..రెడ్ అలర్ట్ జారీ

హింసాకాండతో పాటు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, రిగ్గింగ్ పర్వం వల్ల సోమవారం 696 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు కేంద్ర సాయుధ బలగాల పహరా మధ్య సాగింది. బెంగాల్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 339 కౌంటింగ్ కేంద్రాల్లో సాయుధ పహరా మధ్య ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు సాగుతోంది.

Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్…తెగిపోయే ప్రమాదం

కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశారు. 2018 పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం పంచాయతీ సీట్లు, 22 జిల్లా పరిషత్ స్థానాలను గెల్చుకుంది. పంచాయతీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా హింసకు దిగితే సహించేది లేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నాం సమయానికి పంచాయతీ ఫలితాలు వెల్లడి కానున్నాయి.