IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అతి భారీవర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్, సిమ్లా, సిర్మావూర్, కుల్లూ, మండీ, కిన్నౌర్, లాహౌల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు....

IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

IMD issues Red alert

IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అతి భారీవర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్, సిమ్లా, సిర్మావూర్, కుల్లూ, మండీ, కిన్నౌర్, లాహౌల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. (Himachal for next 24 hours)

Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్… తెగిపోయే ప్రమాదం

ఉనా, హమీర్ పూర్, కాంగ్రా, చాంబా జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. మండీ, కిన్నౌర్, లాహౌల్, స్పితి ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశముందని ఐఎండీ శాస్త్రవేత్త సందీప్ కుమార్ శర్మ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాల వల్ల భారీ నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. ఇలాంటి భారీవర్షాలు గత 50 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని, దీనివల్ల 4వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖు చెప్పారు.

Suchitra Krishnamoorthi : ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అయినా నా భర్తే నన్ను మోసం చేశాడు..

వరదలతో 12 వంతెనలు దెబ్బతిన్నాయి. పలు నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో వదర విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎంతో మాట్లాడారు. ఢిల్లీ,ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాలు, వరదల వల్ల 42మంది మరణించారు.

Heavy Rainfall : భీకర వర్షాలు, పోటెత్తిన వరదలు..

పలు ప్రాంతాల్లో మెరుపువరదలు, పంభవించాయి. పలు రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. భారీవర్షాలు, వరదల వల్ల సానేహాల్-అంబాలా మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించి పోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీవర్షాల వల్ల 20 మంది, జమ్మూకశ్మీరులో 15 మంది, ఢిల్లీలో ఐదుగురు, రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.