Shanghai Cooperation Organization summit: చైనాకు రావాలని మా ప్రధానిని జిన్ పింగ్ ఆహ్వానించారు.. త్వరలో మా ఆర్మీకి కొత్త చీఫ్: పాక్ మంత్రి

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షెహబాజ్ పాల్గొన్న సందర్భంగా ఆయనను జిన్ పింగ్ చైనాకు ఆహ్వానించారని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా పదవీకాలం మూడేళ్ల క్రితమే పూర్తి కాగా, ఆయనను ఆర్మీ చీఫ్ గా 2022 నవంబరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆర్మీకి కొత్త చీఫ్ నియామకం అంశాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పదం చేశారని ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ విమర్శించారు.

Shanghai Cooperation Organization summit: పాకిస్థాన్ ఆర్మీకి కొత్త చీఫ్ రాబోతున్నారు. దీనిపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… నవంబరులో తమ దేశ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఆర్మీ కొత్త చీఫ్ ను నియమిస్తారని చెప్పారు. అంతేగాక, అదే నెల మొదటి వారంలో చైనాలోనూ పర్యటిస్తారని అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానం మేరకు షెహబాజ్ డ్రాగన్ దేశానికి వెళ్తున్నట్లు వివరించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షెహబాజ్ పాల్గొన్న సందర్భంగా ఆయనను జిన్ పింగ్ చైనాకు ఆహ్వానించారని చెప్పారు.

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా పదవీకాలం మూడేళ్ల క్రితమే పూర్తి కాగా, ఆయనను ఆర్మీ చీఫ్ గా 2022 నవంబరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆర్మీకి కొత్త చీఫ్ నియామకం అంశాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పదం చేశారని ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ విమర్శించారు. కాగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షెహబాజ్ పాల్గొన్న సందర్భంగా ఆయనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఆహ్వానించారని అన్నారు. రష్యాకు కూడా షెహబాజ్ వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. గోధుమలు, గ్యాస్ ను పాక్ కు ఎగుమతి చేయాలని రష్యా భావిస్తోందని తెలిపారు.

World oldest Heart : 38 కోట్ల ఏళ్లనాటి నాటి చేప గుండెను కనుగొన్న శాస్త్రవేత్తలు

ట్రెండింగ్ వార్తలు