World oldest Heart : 38 కోట్ల ఏళ్లనాటి నాటి చేప గుండెను కనుగొన్న శాస్త్రవేత్తలు

38 కోట్ల ఏళ్లనాటి నాటి చేప గుండెను కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

World oldest Heart : 38 కోట్ల ఏళ్లనాటి నాటి చేప గుండెను కనుగొన్న శాస్త్రవేత్తలు

World's oldest heart

World’s oldest heart : కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రహస్యాలను వెలికి తీసి ప్రపంచానికి తిరిగి పరిచయం చేస్తున్నారు పరిశోధకులు.ఎన్నో రహస్యాలను వెలుగులోకి తెచ్చే శాస్త్రవేత్తలు మరో అద్భుతమైన ‘గుండె’ను కనుగొన్నారు. ఈ గుండె ఏకంగా 38 కోట్ల ఏళ్లనాటి గుండె. అది ఒక చేప గుండె. 38 కోట్ల ఏళ్ల నాటి ఈ చేప గుండె ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది నిర్ధారించారు శాస్త్రవేత్తలు. చేప గుండెతో పాటు కాలేయం, ఇతర అవయవాలను కూడా గుర్తించారు.

ఆ అవయవాలు ప్రస్తుత సొరచేపను పోలి ఉన్నాయని ఆస్ట్రేలియాకు చెందిన కర్టిన్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఆవిష్కరణతో మనిషి శరీర పరిణామ క్రమాన్ని తెలుసుకోవటానికి వీలవుతుందని తెలిపారు. ఈ శిలాజాన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో కనుగొన్నట్టు వివరించారు.

20 ఏళ్లుగా శిలాజాలపై అధ్యయనం చేసే పాలియోంటాలజిస్ట్ కేట్ ట్రినాజ్బ్సిక్ మాట్లాడుతూ..దాదాపు 50 మిలియన్ సంవత్సరాలపాటు వృద్ధి చెందిన సాయుధ చేపలు అకస్మాత్తుగా అంతరించిపోవటానికి ముందు ఆధునిక షార్క్ అనాటమినీ పోలీ ఉన్నాయని తెలిపారు. ఈ చేపలు వారి గుండె నోటిలో మొప్పల క్రింద కలిగి ఉన్నాయని తెలిపారు.