Asaduddin Owaisi: మన భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది: అసదుద్దీన్

అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ దేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టించారని అన్నారు. డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలను చైనా సైనికులు ఆక్రమించారని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. చైనా దురాక్రమణను కొనసాగిస్తుందని, ఆ దేశంతో వాణిజ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తోన్న తీరుతోనే ముందుకు సాగుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

Asaduddin Owaisi: సరిహద్దుల వద్ద చైనా ఆగడాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ… మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ దేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టించారని అన్నారు. డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలను చైనా సైనికులు ఆక్రమించారని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని తెలిపారు.

చైనా దురాక్రమణను కొనసాగిస్తుందని, ఆ దేశంతో వాణిజ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తోన్న తీరుతోనే ముందుకు సాగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. చైనా చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే పార్లమెంటులో చర్చించాలని అన్నారు. చైనా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో నాయకత్వం వహిస్తే దేశం మొత్తం మద్దతుగా నిలుస్తుందని అన్నారు. మన దేశ ఆర్మీ చాలా శక్తిమంతంగా ఉందని, అయితే, కేంద్ర ప్రభుత్వం బలహీనంగా ఉందని.. చైనాకు భయపడుతుందని చెప్పారు. కాగా, చైనా-భారత్ సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం సరైన వివరాలు తెలపట్లేదని విపక్ష పార్టీలు కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నాయి.

Google: అప్పటి వరకు 100 కోట్ల మంది భారతీయులు ఆన్‭లైన్‭లోకి..

ట్రెండింగ్ వార్తలు