Google: అప్పటి వరకు 100 కోట్ల మంది భారతీయులు ఆన్‭లైన్‭లోకి..

ఇది అంత చిన్న విషయమేమీ కాదని, ఒకే దేశంలో ఇన్ని కోట్ల మంది ఆన్‭లైన్‭ వినియోగించడం సాంకేతికరంగంలో విప్లవాత్మకమైన మార్పని సంజయ్ గుప్త అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, ముఖ్యంగా భారతీయుల అవసరాలకు అనుగుణంగా మలిచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Google: అప్పటి వరకు 100 కోట్ల మంది భారతీయులు ఆన్‭లైన్‭లోకి..

India set to bring 1 billion citizens online by 2025: Google India head

Google: వచ్చే మూడేళ్లలో దేశంలో 100 మంది ఆన్‭లైన్‭ వినియోగిస్తారని గూగుల్ ఇండియా అధినేత సంజయ్ గుప్తా అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 700 మిలియన్ల మంది (70 కోట్లు) భారతీయులు ఆన్‭లైన్‭ ఉపయోగిస్తున్నారని, కేవలం మూడేళ్లలో కొత్తగా 30 కోట్ల మంది కొత్తగా ఇందులోకి వస్తారని అన్నారు. దీంతో 2025 నాటికి దేశంలో ఒక బిలియన్ (100 కోట్లు) భారతీయులు ఆన్‭లైన్‭లోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అన్నారు.

Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

ఇది అంత చిన్న విషయమేమీ కాదని, ఒకే దేశంలో ఇన్ని కోట్ల మంది ఆన్‭లైన్‭ వినియోగించడం సాంకేతికరంగంలో విప్లవాత్మకమైన మార్పని సంజయ్ గుప్త అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, ముఖ్యంగా భారతీయుల అవసరాలకు అనుగుణంగా మలిచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Kapil Sibal: కొలీజియంను సమర్ధించిన కపిల్ సిబాల్.. కోర్టులు కాషాయమయం కావొద్దంటూ హెచ్చరిక

ఇక కృత్రిమ మేధ(ఏఐ)కు సంబంధించిన అన్ని రకాల పరిశోధనల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌కు రూ.8.26 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇదే కార్యక్రమం నుంచి గూగుల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గ్రాంట్ ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే, లాభాపేక్షలేని సంస్థ వాధ్వానీ ఏఐకు కూడా google.org రూ.8.26 కోట్లు మంజూరు చేయనుందని భారత గూగుల్ పరిశోధనల విభాగ డైరెక్టర్ మనీశ్ గుప్తా చెప్పారు.