Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్తలు సైతం గుప్పుమంటున్నాయి. అయితే మస్క్ మాత్రం ట్విట్టర్ ఎంగేజ్మెంట్ పెరుగుతోందని చెప్తున్నారు. ఆ మధ్య బ్లూ టిక్ వివాదం సైతం చాలా వివాదాస్పదమైంది.

Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

Should I step down as head of Twitter? ask Musk to netizens

Elon Musk: ట్విట్టర్ స్వాధీనం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న బిలియనీర్ ఎలాన్ మస్క్‭కు స్వయంగా ఆయనే పెట్టిన ట్విట్టర్ పోల్‭లో షాక్ తగిలింది. ఆయన పెట్టిన పోల్‭కు 9 గంటల్లో సుమారు 1.6 కోట్ల మంది ఓట్లు వేయగా.. అందులో 57.4 శాతం మంది ట్విట్టర్ బాస్‭గా మస్క్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ‘ట్విట్టర్ బాస్‭గా దిగిపోవాలా?’ అంటూ మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు.

CM Sukhvinder Singh Covid-19 : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు కరోనా పాజిటివ్

కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్తలు సైతం గుప్పుమంటున్నాయి. అయితే మస్క్ మాత్రం ట్విట్టర్ ఎంగేజ్మెంట్ పెరుగుతోందని చెప్తున్నారు. ఆ మధ్య బ్లూ టిక్ వివాదం సైతం చాలా వివాదాస్పదమైంది.

BRS Politics : మంత్రి మల్లారెడ్డితో విభేదాలు..ఆసక్తిగా మారిన ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం

అయితే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ మస్క్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కొన్నిసార్లు నెటిజెన్ల అభిప్రాయాలను బట్టి తన నిర్ణయాలు మార్చుకుంటున్న మస్క్.. కొన్ని కీలక నిర్ణయాల్లో మాత్రం ఎవరి మాటా లెక్కచేయలేదు. కొద్ది రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై పోల్ పెట్టగా, చాలా మంది స్వాగతించారు. దాంతో నెటిజెన్ల అభిప్రాయం మేరకు ట్రంప్ ఖాతాను పునరుద్దరించారు. అయితే ఈసారి ఏకంగా తన కుర్చీ కింద తానే మంట పెట్టుకున్నారు మస్క్. ఈసారి కూడా నెటిజెన్లు సూటిగానే తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి వారి అభిప్రాయాల మేరకు ట్విట్టర్ బాస్ నుంచి మస్క్ తప్పుకుంటారో లేదో చూడాలి.