CM Sukhvinder Singh Covid-19 : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు కరోనా పాజిటివ్
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజుల నుంచి ఆయన స్పల్వ జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

CM Sukhwinder Singh Sukh
CM Sukhvinder Singh Covid-19 : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజుల నుంచి ఆయన స్పల్వ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అయితే, సీఎం అయిన కొన్ని రోజులకే సుఖ్విందర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సీఎం సుఖ్విందర్ సూచించారు. ఇటీవలే జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
Himachal Pradesh: కేబినెట్ విస్తరణపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలిచింది. దీంత అధిష్టానం సుఖ్విందర్ సిగ్ సుఖుకు సీఎం పదవిని కట్టబెట్టింది. కాగా, బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది.