BRS Politics : మంత్రి మల్లారెడ్డితో విభేదాలు..ఆసక్తిగా మారిన ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం

పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డితో విభేదాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో సీక్రెట్ గా సమావేశం కావటం ఆసక్తి కలిగిస్తోంది.

BRS Politics : మంత్రి మల్లారెడ్డితో విభేదాలు..ఆసక్తిగా మారిన ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం

BRS MLAS meeting in mla mynampally hanumantha rao

BRS Politics : బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యలు మరోసారి బయటపడ్డాయా? సొంత పార్టీ నేతల్లోనే ఒకరిపై మరొకరికి గిట్టటంలేదా? వారసుల కోసం కొత్త రాజీకీయాలకు తెరతీశారా?అంటే నిజమననిపిస్తోంది మేడ్చల్ జిల్లాలో జరిగిన ఓ సీక్రెట్ భేటీ. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డితో విభేధాలున్న ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో సమావేశం కావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో భేటీ అయ్యారు.

ఈ భేటీ వెనుక మైనంపల్లి రాజకీయం కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ కు పోటీ చేయాలని భావిస్తున్నారు ఆయన. అదే సయమంలో తన కుమారుడిని రంగంలోకి దింపు ఎమ్మెల్యేను చేయాలనుకుంటున్నారు. దీని కోసం ఇప్పనుంచే రాజకీయం మొదలుపెట్టేశారు. దీంట్లో భాగంగానే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెలను రప్పించుకుని తన నివాసంలో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. కానీ సరదాగా బ్రేక్ ఫాస్ట్ చేయటానికి మాత్రమే తాము సమావేశం అయ్యమని చెబుతున్నారు మైనంపల్లి. మంత్రి మల్లారెడ్డితో మైనంపల్లికి విభేధాలు ఉన్నాయి. దీంతో మల్లారెడ్డితోనే విభేధాలున్న ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

జరుగుతుంది. ఈ భేటీకి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగుతుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ కోసమే మిగిలిన ఎమ్మెల్యేలను ఇంటికి ఆహ్వానించినట్టుగా మైనంపల్లి హన్మంతరావు చెబుతున్నారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని..సరదాగా బ్రేక్ ఫాస్ట్ చేయటానికేనంటున్నారు. కానీ ఊరకరారు మహానుభావులు అన్నట్లుగా రాజకీయ నేతలు భేటీ అంటే ఊరకే జరగదు కదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఎమ్మెల్యేలు ఈ సమావేశం నిర్వహించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఒకప్పుడు మంత్రి మల్లారెడ్డి అందరితోను కలిసిపోయేవారు. అందరిని కలుపుకుపోయే మనస్థత్వంతో ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయనలో మార్పు వచ్చిదంటున్నారు గులాబీ నేతలు. దీంతో ఇటీవల కాలంలో మల్లారెడ్డి ప్రవర్తనతో ఆయనతో కొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు విభేధిస్తున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మల్లారెడ్డి తన నియోజకవర్గంలో పనిచేసుకోకుండా తమ తమ నియోజకవర్గాల్లో కూడా వేలు పెడుతున్నారని తమ నియోజకవర్గాల్లో జరిగే విషయాల్లో జోక్యం చేసుకుంటూ తలనొప్పిగా మారారని కొంతమంది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలోనే మైనంపల్లి కూడా ఈ పరిస్థితిని వాడుకోవాలనే ఉద్ధేశ్యంతో తన ఎంపీ పోటీని..తన కొడుకుఎమ్మెల్యే సీటు ప్లాన్ పై చర్చించేందుకు మల్కాజగిరి పరిధిలోని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మైనంపల్లి హన్మంతరావు తన నివాసంలో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలపై..ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి తీరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సదరు నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.