Flights Out Of Russia: పుతిన్ చేసిన ప్రకటనతో రష్యా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు.. విదేశాలకు వెళ్లిపోతున్న వైనం

సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై పుతిన్ సంతకాలు చేసిన వెంటనే రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి పెద్ద ఎత్తున పౌరులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎందుకంటే రష్యాలో మార్షల్ చట్టం విధించే అవకాశం ఉందని పౌరులు భావిస్తున్నారు. మార్షల్ చట్టం విధిస్తే ప్రభుత్వ పరిపాలన అంతా సైనిక వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉంటాయి. దీంతో రష్యా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Flights Out Of Russia: యుక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తింటున్న రష్యా కీలక నిర్ణయాలు తీసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. యుక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలను ఎదుర్కొనేందుకు, తమ భూభాగాలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై కూడా ఆయన సంతకాలు చేసిన వెంటనే రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి పెద్ద ఎత్తున పౌరులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు.

దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎందుకంటే రష్యాలో మార్షల్ చట్టం విధించే అవకాశం ఉందని పౌరులు భావిస్తున్నారు. మార్షల్ చట్టం విధిస్తే ప్రభుత్వ పరిపాలన అంతా సైనిక వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉంటాయి. దీంతో రష్యా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రష్యా ప్రజలు అతి భారీగా విదేశాలకు టికెట్లు బుక్ చేసుకున్నారని ఫ్లైట్ రాడార్ 24 అనే గ్లోబల్ ఫైట్ ట్రాకింగ్ సర్వీస్ సంస్థ తెలిపింది.

గూగుల్ ట్రెండ్స్ డేటా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విమాన టికెట్లను కొనుగోలు చేయడానికి రష్యాలో అత్యధికంగా ఏవియాసేల్స్ వెబ్ సైటును వాడతారు. రష్యా నుంచి వెళ్లిపోవడానికి ఆ వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారి సంఖ్య అతి భారీగా పెరిగింది. కాగా, యుక్రెయిన్ లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినప్పటి నుంచి రష్యా-ఐరోపా సమాఖ్య మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

Rahul Gandhi On Congress President: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్.. కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు