Rahul Gandhi On Congress President: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్.. కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దానిపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికలో పోటీ చేస్తున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఇది ఓ పదవి కాదు. ఓ నమ్మకమైన వ్యవస్థ. భారతదేశ విజన్ కు ప్రాతినిధ్యం వహించడం’’ అని చెప్పారు. కాంగ్రెస్ లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ నిబంధనకు తాను మద్దతు తెలుపుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేపథ్యంలో రాహుల్ చేసిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.

Rahul Gandhi On Congress President: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్.. కీలక వ్యాఖ్యలు

Bharat Jodo Yatra

Congress President Polls: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దానిపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికలో పోటీ చేస్తున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఇది ఓ పదవి కాదు. ఓ నమ్మకమైన వ్యవస్థ. భారతదేశ విజన్ కు ప్రాతినిధ్యం వహించడం’’ అని చెప్పారు. కాంగ్రెస్ లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ నిబంధనకు తాను మద్దతు తెలుపుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేపథ్యంలో రాహుల్ చేసిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.

అధ్యక్ష పదవిలో ఎవరున్నా సరే ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని మరోసారి స్పష్టం చేశారు. ఉదయ్ పూర్ తీర్మానం అమలు కావాలని అన్నారు. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి గహ్లోత్ ఒప్పుకోవట్లేదు.

ఒకవేళ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆ పదవి కాంగ్రెస్ లోని తన ప్రత్యర్థి సచిన్ పైలట్ కు దక్కుతుందని గహ్లోత్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. కేరళలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీ సుముఖంగా లేరు.

Yoghurt Improves Beauty : ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పెరుగు! ఏవిధంగానంటే ?