Yoghurt Improves Beauty : ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పెరుగు! ఏవిధంగానంటే ?

పెరుగుతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. రోజుకో కప్పు పెరుగు తింటే బీపీ కంట్రోల్‌లో ఉండడం, ఎముకలు బలంగా మారడం, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

Yoghurt Improves Beauty : ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పెరుగు! ఏవిధంగానంటే ?

Yoghurt that improves health and beauty

Yoghurt Improves Beauty : పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. పెరుగు మన శరీరాన్ని కవచంలా కాపాడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పెరుగుతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. రోజుకో కప్పు పెరుగు తింటే బీపీ కంట్రోల్‌లో ఉండడం, ఎముకలు బలంగా మారడం, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. పెరుగు ఆరోగ్యానికి ఎంత ఉప‌యోగ‌ప‌డుతుందో సౌంద‌ర్యానికి కూడా అంతే ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మానికి మృదుత్వాన్ని అందించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి.

అందానికి పెరుగు ;

1. పెరుగులో శ‌న‌గ‌పిండిని క‌లిపి చ‌ర్మానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గుతాయి. అంతేకాకుండా జుట్టుకు కూడా పెరుగుతుంది.

2. స్నానం చేసేట‌ప్పుడు పెరుగును తీసుకుని జుట్టు కుదుళ్ల‌లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేయాలి. ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు దృఢంగా, మృదువుగా త‌యార‌వుతుంది.

3. ఒక స్పూన్ పెరుగు, నిమ్మరసం, తేనె ను తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి ,మెడకు అప్లై చేయాలి. 20నిమిషాలు వుంచి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. పెరుగు, పసుపు మరియు శెనగపిండి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.. అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల.. ముఖం అందంగా తయారవుతుంది.

5. పెరుగు, ఎగ్‌వైట్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.. అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చెస్తె ముడుతలు తగ్గి మెరుస్తుంది.

6. పెరుగులో కొంచెం పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలపుదనం తగ్గుతుంది.

7. ఎండలో తిరిగేవారు పెరుగులో ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంలో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

8. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీరమంతటా అప్లయి చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.

9. పెరుగు, నిమ్మకాయ పొడి చర్మాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. పొడి చర్మంలో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ముఖంపై పెరుగు, నిమ్మకాయ మిశ్రమాన్ని వినియోగిస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

10.బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.