Online Shopping Sites: ప్రపంచంలోనే టాప్ 10 పాపులర్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్

కొన్నేళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్ తో పాటు మహమ్మారి కారణంగా ఆన్ లైన్ షాపింగ్ కే మొగ్గు చూపుతున్నారు కస్టమర్లంతా. సంవత్సరమంతా డిస్కౌంట్లు, డీల్స్ యూజర్లను ఆన్ లైన్ షాపింగ్ నుంచి...

Online Shopping Sites: కొన్నేళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్ తో పాటు మహమ్మారి కారణంగా ఆన్ లైన్ షాపింగ్ కే మొగ్గు చూపుతున్నారు కస్టమర్లంతా. సంవత్సరమంతా డిస్కౌంట్లు, డీల్స్ యూజర్లను ఆన్ లైన్ షాపింగ్ నుంచి తలతిప్పుకోనివ్వడం లేదు. ఈ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ గా నిలిచిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ మీ కోసం..

Amazon.com
ఆశ్చర్యకరంగా అమెజాన్ టాప్ లిస్టులో చేరింది. ఆన్ లైన్లో అందరి కంటే ఎక్కువ కస్టమర్లను దక్కించుకుంది.

Taobao.com
చైనీస్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం అయిన తావోబావో.కామ్ అలీబాబా గ్రూప్ కు చెందినది.

Ebay.com
పాపులారిటీ దక్కించుకున్న వాటిలో అన్నింటికంటే తక్కువ కాలంలో స్టార్ట్ చేసిందిదే.

rEAD aLSO: హాఫ్ శారీలో మెరిసిపోతున్న దీపిక..

Walmart.com
అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్మార్ట్. చాలా వరకూ స్టోర్స్ లో కొనుగోలు చేయడానికే మొగ్గు చూపే కస్టమర్ల నుంచి క్రమంగా ఆన్ లైన్ పాపులారిటీని కూడా పెంచుకుంటుంది వాల్మార్ట్.

Jd.com
లిస్టులో ఉన్న మరో చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం జేడీ.కామ్. టెన్సెంట్, వాల్మార్ట్ లకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి.

Shopify.com
కెనడాకు చెందిన ఆన్ లైన్ ప్లాట్ ఫాం ప్రపంచంలో పాపులారిటీ దక్కించుకున్న ఆరో సంస్థగా నిలిచింది.

Bestbuy.com
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో అతిపెద్ద రిటైలర్ గా మారింది బెస్ట్ బై.కామ్. లిస్టులో ఏడో స్థానంలో నిలిచింది bestbuy.

Target.com
అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం టార్గెట్. ఆన్‌లైన్ షాపింగ్ లిస్టులో 8వ స్థానంలో ఉంది.

Rakuten
జపాన్ ఈ కామర్స్ దిగ్గజం రగూటెన్ పాపులారిటీలో 9వ స్థానంలో ఉంది.

The Home Depot
యూఎస్ కు చెందిన రిటైల్ దిగ్గజం ద హోమ్ డిపో. 2021లో ప్రపంచంలోని ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో పదోది.

ట్రెండింగ్ వార్తలు