Texas
Texas Guru Purnima : గురు పూర్ణిమం సందర్భంగా టెక్సాస్ ఆధ్మాత్మికతను సంతరించుకుంది. ఒకే చోట 10 వేల మంది కలిసి భగవద్గీత (Bhagavad Gita) పఠించారు. యోగా (Yoga), సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేషన్ (SGS Geeta Foundation) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నులపండుగలా సాగింది.
టెక్సాస్‌లోని అలెన్ ఈస్ట్ సెంటర్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భగవద్గీతా పారాయణం జరిగింది. యోగా సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో ఈ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో 4 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 10,000 మంది భగవద్గీత పఠించారు. గురు పూర్ణిమ రోజు గురువులను పూజించడం, వారికి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వచనాలు తీసుకోవడం సంప్రదాయం. గురువును భగవంతుడిలా భావిస్తారు. ఈరోజున వ్యాస మహర్షి జన్మించారని నమ్ముతారు. ఆయన గురు పూర్ణిమ రోజు బ్రహ్మ సూత్రాలను రాయడం ప్రారంభించారని చెబుతారు.
Gita GPT vs ChatGPT: భగవద్గీత స్ఫూర్తితో ChatGPT వంటి చాట్ బాట్ అభివృద్ధి చేసిన బెంగళూరు వ్యక్తి
ఇక గురు పూర్ణిమ రోజున బౌద్ధులు బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని అందించిన రోజుగా భావిస్తారు. ఎంతో శుభకరమైన ఈరోజున టెక్సాస్ మొత్తం భక్తిభావంలో మునిగిపోయింది. గీతా పఠనంతో మారుమోగింది.
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
(Source: Avadhoota Datta… pic.twitter.com/saVlZIjBML
— ANI (@ANI) July 3, 2023