Iran blasts
Iran blasts: ఇరాన్ దేశంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మంది మరణించిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇరాన్ ఆగ్నేయ నగరమైన కెర్మాన్ లో జరిగిన ఓ వేడుకలో రెండు పేలుడు ఘటనలు సంభవించాయని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. జనరల్ ఖాసిం సులేమానీ స్మారకార్థం జరుగుతున్న వేడుక సందర్భంగా అతన్ని స్మరించుకుంటున్న జనసమూహంపై రెండు బాంబులతో దాడి చేశారు. ఈ పేలుడు ఘటనలు కెర్మాన్ నగరంలోని సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో జరిగాయి.
ALSO READ : శ్రీకాకుళం పార్లమెంట్ సీటుపై వైసీపీ గురి.. బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ
ఈ పేలుళ్లు ఉగ్రవాద దాడి అని కెర్మాన్ డిప్యూటీ గవర్నర్ చెప్పారు. ఈ బాంబు దాడుల్లో కనీసం 170 మంది గాయపడ్డారని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. బాంబులను మోసుకెళ్ళే రెండు బ్యాగులు పేలాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబులు పేల్చారని సమాచారం. 10 నిమిషాల వ్యవధిలో బాంబులు పేలాయని కెర్మాన్ మేయర్ సయీద్ తబ్రీజీ చెప్పారు.
ALSO READ : మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి, చాలా బాధగా ఉందంటూ భావోద్వేగం
పేలుళ్ల అనంతరం భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో జనాలు పారిపోవడానికి యత్నించారు. సులేమాని హీరోగా పొరుగు దేశాలైన అప్ఘానిస్తాన్‌తో పాటు సిరియా, ఇరాక్‌ల బహుళ జాతి విచ్ఛిన్నతను అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు.