మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి, చాలా బాధగా ఉందంటూ భావోద్వేగం

వైసీపీలో ఇంఛార్జ్ లను సీఎం జగన్ మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 27మంది ఇంఛార్జిలతో రెండో జాబితాను విడుదల చేశారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి, చాలా బాధగా ఉందంటూ భావోద్వేగం

Minister Gudivada Amarnath Cries

Updated On : January 3, 2024 / 11:14 PM IST

Gudivada Amarnath : ఏపీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. అనకాపల్లి వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారాయన. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇంఛార్జి మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నా, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్

వైసీపీలో అన్నింటికంటే పెద్ద పోస్టు అదే- గుడివాడ అమర్నాథ్
‘నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు, ఛానళ్ళు రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. చిన్న వయసు నుండే కష్టాలు చూసిన వాడిని. ఇలాంటి వార్తల వల్ల నేను కుంగిపోను. వైసీపీలో అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది. అది వైపీసీ కార్యకర్త పోస్టు. అది ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. మీతో పాటు కార్యకర్తగా జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నా. వీధుల్లో కార్యకర్తగా తిరగతా. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం. అధికారం వచ్చాక కొంతమందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది.

నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశా. అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జి భరత్ కు సహకరించాలి” అని కార్యకర్తలకు సూచించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను మారేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 27 మంది ఇంఛార్జిలతో రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఈ జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్ ను మార్చేశారు జగన్. ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో కొత్త వ్యక్తిని ఇంఛార్జిగా నియమించారు. అమర్నాథ్ బదులు భరత్ కుమార్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. ఈసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ బరిలోకి దిగనున్నారు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచేశారు జగన్.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?