బాప్ రే : 10 పైసల బిళ్ల రూ.10 కోట్లు!!

  • Publish Date - August 22, 2019 / 10:21 AM IST

డబ్బులను డబ్బులతోనే కొనుక్కోవటం. చిత్రంగా ఉంది కదూ. ఓ 10 పైసల బిళ్ల ఏకంగా రూ.10కోట్లకు అమ్ముడుపోయింది!!. నమ్మటంలేదు కదూ. ఇది అక్షరాలా నిజం. నమ్మి తీరాల్చిందే. ఏంటీ ఇంట్లో పది పైసల బిళ్లలు ఎక్కడున్నాయా అని వెతికేస్తున్నారా? అంత శ్రమ పడక్కర్లేదు. 10పైసలు బిళ్ల ఇంత ఖరీదుకి అమ్ముపోయింది అంటే దానికో స్పెషాలిటి ఉండే ఉంటుందికదా..ఏమిటా స్పెషాలిటీ వివరాలేంటో తెలుసుకుందాం..

అమెరికాలోని షికాగో లో గురువారం (ఆగస్టు21)న ఓ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటలో  ఎన్నో పురాతన వస్తువులు అందుబాటులో ఉంచారు వేలం  నిర్వాహకులు.అక్కడ ఉన్నఅన్ని  వస్తువులుల్లోకెల్లా అందరినీ ఆకర్షించింది ఈ 10పైసల బిళ్ల.  దాన్ని దక్కించుకోవాలని అందరూ ఆరాట పడ్డారు. దాని కోసం పోటీ పడ్డారు. వేలం పెంచుకుంటు పోయారు.

కానీ ఎట్టకేలకూ ఓ బడా వ్యాపారవేత్త దక్కించుకున్నాడు. ఉటా వ్యాపారవేత్త, రియల్ సాల్ట్ లేక్ సాకర్ క్లబ్ యజమాని డెల్ లోయ్ హాన్సెన్ అందరికన్నా ఎక్కువ మొత్తంలో పాడి ఆ పదిపైసల్ని  అక్షరాలా 1.32 million డాలర్లు పాడి దక్కించుకున్నాడు. అంటే ఇండియా కరెన్సీలో 10 కోట్లు..!!.  ఈ 10పైసల బిళ్ళని  1894 లో ముద్రించారట. అంటే ఈ నాణెం 125 ఏళ్ల నాటిదిగా తెలుస్తోంది.

అంతేకాదు ..అటువంటి బిళ్లలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 మాత్రమే ఉన్నాయి.ఇటువంటి అరుదుగా ఉండే  నాణేలని డైమ్ అంటారు. వీటి విలువ అప్పట్లో చాలా అధికంగా ఉండేదనీ..కేవలం పెద్ద పెద్ద ధవంతుల ఇళ్ళలో మాత్రమే ఈ నాణాలు (డైమ్స్) ఉండేవని అందుకే దీని ధర కోట్లు పలికిందని అంటున్నారు చరిత్ర కారులు.