×
Ad

హాంకాంగ్‌లో 128 మంది చనిపోవడానికి ఈ కిటికీలూ కారణం..! మీ ఇంటికి కూడా ఇవే వేశారేమో చూడండి..

హాంకాంగ్ ప్రమాదంలో 24 గంటల పాటు మంటలు చెలరేగాయి.

Hong Kong Fire

Hong Kong Fire: హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 128కి పెరిగింది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. సిగరెట్ తాగి పడేయడం వల్ల జరిగిందని ప్రచారం జరుగుతోంది.

పెద్ద ఎత్తున సిగరెట్ ముక్కలు పడి ఉండడం వల్ల ఎక్కువ మంటలు వచ్చాయని అంటున్నారు. ఆ బిల్డింగ్ రినోవేషన్ కోసం చుట్టూ కర్రలు, పరదాలు కట్టారు. మంటలు పెరగడానికి అవి కూడా దోహదం చేశాయి.

బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడానికి కిటికీలకు వాడిన మెటీరియల్ కూడా కారణం అని ప్రచారం జరుగుతోంది. కిటికీల కోసం పాలిస్టెరైన్ వాడినట్టు తెలుస్తోంది. ఈ పాటిస్టెరైన్ వల్ల మంటలు వ్యాపించాయనే వాదన ఉంది.

Also Read: Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..

అన్ని గంటలు మంటలు వచ్చినా ఎలా బయటపడ్డారు?
హాంకాంగ్ ప్రమాదంలో 24 గంటల పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంటలు ఆర్పడంలో అంత లేట్ ఎందుకు అయిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2.50కి మంటలు ఒక ఇంట్లో ప్రారంభమై, రాత్రి 7.30 వరకు 8 బ్లాకులకు మంటలు వ్యాపించాయి. 94 మంది చనిపోవడం బాధాకరం.

అయితే, అపార్ట్‌మెంట్లలో ఉండే వాళ్లలో ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడిన వారే. మంటలు వ్యాపించినప్పుడు పై ఫ్లోర్లలోకి వెళ్లలేక చనిపోయారు. 24 గంటలు మంటలు చెలరేగినప్పటికీ 128 మంది మాత్రమే చనిపోవడం ఒక రకంగా తక్కువే.

మంటలను ఆర్పడంలో విఫలమైనా ప్రాణాలను కాపాడడంలో కొంత మేర సక్సెస్ అయ్యాయి అగ్నిమాపక దళాలు. చీకటి కావడం వల్ల కూడా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. మంటల కంటే కూడా పొగ పీల్చడం వల్ల ఎక్కువ ప్రాణనష్టం జరిగింది.