Congo Floods : కాంగోలో వరద బీభత్సం.. 176 మంది మృతి, 200 మందికి పైగా గల్లంతు

ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.

Congo Floods

Congo Floods : ఆఫ్రికాలోని కాంగోలో వరద బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కివు ప్రావిన్స్ లో నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఊర్లకు ఊర్లే వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరదల ధాటికి 176 మంది మరణించారు.

మరో 200 మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. కాగా, ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. నిలువ నీడలేకపోవడంతో ఆరుబయటే ఉంటున్నారని తెలిపారు.

Philippines Floods: ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు.. 20మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది

దక్షిణ కివులో వరదలు, కొండచరియలు విరిగి పడటం సర్వ సాధారణమని అధికారులు పేర్కొన్నారు.
2014లో కూడా ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించిందని గుర్తు చేశారు. భారీ వర్షాలకు ఏడు వందలకు పైగా ఇళ్లు తుడిచిపెట్టుకు పోయాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

130 మందికి పైగా గల్లంతయ్యారని ఐరాస పేర్కొంది. గత నెల ఏప్రిల్ లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. కిన్ షాసాలో డిసెంబర్ కురిసిన భారీ వర్షాలతో 169 మంది చెందారు.