Kazakhstan : ఎల్పీజీ ధరల పెంపు నిరసనలు హింసాత్మకం..18 మంది పోలీసుల మృతి

ప్రధాని అస్కర్ మామిన్ నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసినా.. పరిస్థితులు అదుపులోకి రాలేదు. తొలుత అల్మాటి నగరంలో ఈ ఆందోళనలు జరిగినా..

Kazakhstan LPG : కజకిస్తాన్‌లో ఎల్పీజీ ధరల పెంపుపై ఒక్కసారిగా పెల్లుబికిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని అస్కర్ మామిన్ నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసినా.. పరిస్థితులు అదుపులోకి రాలేదు. తొలుత అల్మాటి నగరంలో ఈ ఆందోళనలు జరిగినా.. ఆ తర్వాత వేగంగా దేశమంతటా పాకాయి. ఈ ఆందోళనల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. 18 మంది పోలీసులు మరణించారు. ఇందులో ఒకరిని తల నరికి చంపేశారు. చమురు ధరల పెంపుతో ఆందోళనకారులు ఆగ్రహంతో ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు ఈ ఆందోళనల్లో సుమారు 353 మంది నిరసనకారులు గాయపడ్డారు.

Read More : SSG Security Withdrawal : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కశ్మీర్‌లో నలుగురు మాజీ సీఎంలకు ఎస్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

మరోవైపు దేశంలో పెరుగుతున్న అశాంతిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను సమకూర్చాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్.. రష్యా నేతృత్వంలోని సీఎస్‌టీవోకి విజ్ఞప్తి చేశారు. దీంతో రష్యా సారథ్యంలోని మిలిటరీ అలయెన్స్ అదనపు ట్రూపులను పంపడానికి సిద్ధమైంది. దీంతోపాటు నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న అల్మాటీ, మాంగిస్టౌ ప్రావిన్స్‌ తదితర ప్రాంతాల్లో జనవరి 19 వరకు అత్యవసర పరిస్థితి విధించారు. ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపేశారు. ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇరువర్గాలు సంయమనం పాటించాలని కోరారు. తమ నిరసనలను శాంతియుతంగా వ్యక్తపరిచేందుకు ప్రజలకు అనుమతివ్వాలని అమెరికా సూచించింది.

ట్రెండింగ్ వార్తలు