South America Guyana : దక్షిణ అమెరికా గయానాలో భారీ అగ్నిప్రమాదం.. 20మంది విద్యార్థులు సజీవ దహనం

బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.

Guyana Fire Accident : దక్షిణ అమెరికాలోని గయానాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. స్కూల్ హాస్టల్ భవనంలో మంటలు చెలరేగడంతో 20 మంది విద్యార్థులు మృతి చెందగా, అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గయానా ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గయానా దేశ రాజధాని జార్జిటౌన్ కు 200 కిలోమీటర్ల దూరంలోని నైరుతి సరిహద్దు పట్టణం మహ్దియాలోని ఓ సెకండరీ స్కూల్ హాస్టల్ భవనంలో ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Fire Accident : హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

దీంతో 20మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. అనేక మంది గాయపడ్డారు. బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.

ఆ ప్రాంతంలో వాతావరణం కూడా సరిగ్గా లేదని ఉరుములు మెరుపులతో  కూడిన భారీ వర్షం కురిసినట్లు జాతీయ రక్షణ సలహాదారు గెరాల్ద్ గవియా తెలిపారు. దీంతో బాధితులను వాయుమార్గంలో తరలించడానికి, సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరపాలని విపక్ష నేత నటాషా సింగ్ లూయిస్ డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు