కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది.. ప్రపంచదేశాల్లో అత్యధిక పాజిటివ్ కేసులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న అగ్రరాజ్యం… తాజాగా మరణాల్లోనూ అగ్రస్థానానికి చేరింది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటింది. దీంతో ఇటలీని వెనక్కినెట్టింది. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటిపోయింది. కరోనాను తేలికగా తీసుకున్న అగ్రరాజ్యం ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోంది.
చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా భూతం.. అమెరికాను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. కోవిడ్ పంజాకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతోంది. కంటి మీద కునుకు లేకుండా గడుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతోపాటు… మరణాలు అత్యధికంగా నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. ఇప్పకే ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 20వేలు దాటేసింది.. దీంతో ఇటలీ రెండవ స్థానానికి పడిపోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటిపోయాయి.
24 గంటల్లో 2వేల మందికి కరోనా :
వైరస్‌ను నిరోధించడానికి భారీగా టెస్టింగ్‌లు, లాక్ డౌన్, సాంఘిక దూరం వంటి విస్తృత చర్యలను అమలు చేస్తోంది అమెరికా. అయినా కరోనావైరస్ కాటుకు పుల్‌స్టాప్ పడటంలేదు. రోజు జుకూ మరణాల సంఖ్య మారిపోతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా దాదాపు 2వేల మంది కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే… ఇప్పటికే … వైరస్ కారణంగా అగ్రరాజ్యంలో లక్ష మందికి పైగా చనిపోయే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆర్థిక రంగం పూర్తిగా స్తంభించిపోయింది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే అనేక మంది ప్రజలు ఆకలితో అలమటించే దుస్థితి తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్ష మంది చనిపోయే అవకాశం :
అగ్రరాజ్యంలో కరోనా మాత్రమే కాదు… దాని ప్రభావంతో నిరుద్యోగం కూడా తాండవిస్తోంది. ఇప్పటివరకు 7లక్షల ఉద్యోగాలకు ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు… ఆంక్షల్ని ఎప్పుడు ఎత్తివేయాలన్నది ఆ దేశానికి సవాల్‌గా మారింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్న అగ్రరాజ్యం అధినేత… సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇందుకోసం నిపుణులు, సలహాదారులు, కొవిడ్-19పై ఏర్పాటు చేసిన కార్యదళం సూచనలను తీసుకుంటానన్నారు. అయితే ఆంక్షలను ఎప్పుడు ఎత్తివేస్తారన్న దానిపై మాత్రం అధ్యక్షుడు కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు.
Also Read | ఒక్క కరోనా.. కోటి బుల్లెట్లతో సమానం.. వైరస్‌తో మారణహోమానికి ఉగ్రవాదుల ప్లాన్