Pakistan : ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహాయకుడి కాల్చివేత

26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహాయకుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ నాయకుడు ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ ను పాకిస్థాన్ దేశంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు....

Qaiser Farooq

Pakistan : 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహాయకుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ నాయకుడు ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ ను పాకిస్థాన్ దేశంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. కరాచీ నగరంలో హఫీజ్ సయీద్ సన్నిహితుడిగా పేరొందిన ఖైజర్ ఫరూఖ్ ను ఆగంతకులు కాల్చిచంపిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. (26/11 mastermind Hafiz Saeed’s aide shot dead) 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుల్లో ఖైజర్ ఫరూక్ ఒకరు.

Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన

సమనాబాద్ ప్రాంతంలోని ఒక మతపరమైన సంస్థ కార్యాలయం సమీపంలో జరిగిన దాడిలో 30 ఏళ్ల ఖైజర్ ఫరూక్ హతం అయ్యాడు. వెనుక భాగంలో బుల్లెట్ గాయాలైన ఫరూక్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఫరూక్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల హఫీజ్ కుమారుడిని కిడ్నాప్ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ తీవ్ర భయాందోళనల్లో జీవిస్తున్నాడని పాక్ వర్గాలు తెలిపాయి.