Japan : భవనంలో అగ్నిప్రమాదం…27 మంది మృతి

ఒసాకాలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 27 మంది చనిపోయారు.

Japan : భవనంలో అగ్నిప్రమాదం…27 మంది మృతి

Japan fire

Updated On : December 17, 2021 / 10:17 AM IST

Building Fire In Japan : జపాన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒసాకాలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 27 మంది చనిపోయారు. Kitashinchi ఎంటర్ టైన్ మెంట్ ఏరియాలో 8 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయని ఒసాక నగర అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. 28 మంది మంటల్లో చిక్కుకున్నారని, 27 మంది ఊపిరిఆడక అక్కడికక్కడనే చనిపోయారన్నారు.

Read More : Omicron Variant In India: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. టెన్షన్ పెట్టేస్తున్న ఒమిక్రాన్!

ఈ భవనంలో ఇంటర్నల్ మెడిసిన్ క్లినిక్, ఇంగ్లీషు పాఠశాల, ఇతర వ్యాపార సంస్థలున్నాయని NHK టెలివిజన్ తెలిపింది. అసలు అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియరాలేదు. ఒసాక పోలీసులు అగ్నప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు. భవనంలో ఉన్న ఇతరులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలరని, మంటలను ఆర్పడానికి డజన్ల సంఖ్యలో అగ్నిమాపక శకటాలను రప్పించినట్లు తెలిపారు. మొత్తం 70 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయని, 30 నిమిషాల్లో మంటలను ఆర్పడం జరిగిందన్నారు. మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.