Terror Attack :మిలిటరీ క్యాంప్‌పై కారుబాంబులతో ఉగ్రదాడి..27 మంది సైనికులతో పాటు 70 మంది ఉగ్రవాదులు హతం

మిలిటరీ క్యాంప్‌పై కారుబాంబులతో ఉగ్రదాడి చేయటంతో ..27 మంది సైనికులు మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులు కూడా హతం అయ్యారు.

27 Soldiers Killed In Attack On Military Camp Mali : పశ్చిమ ఆఫ్రికాలోని మాలీలో మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు కారు బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 27 మంది జవాన్లు మరణించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురి ఆచూకీ లభించడంలేదని మాలి ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ దాడిలో 70మంది ఉగ్రవాదులు కూడా హతం కావటం గమనించాల్సిన విషయం.ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్‌ మాలీలోని (Central Mali) గ్రామీణ ప్రాంతమైన మోడోరోలో ఉన్న మిలిటరీ క్యాంపుపై కారు బాంబులతో దాడిచేశారని వెల్లడించింది. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మంది దాకా ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. కానీ ఈ దాడి చేసింది తామేనంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.

Also read : Srinagar Terror Attack : శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి, 11మందికి తీవ్రగాయాలు

సెంట్రల్‌ మాలీలో అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలు చురుకుగా తమ కార్యకాలపాలు నిర్వహిస్తున్నాయి. 2012లో ఉత్తరాన ఉన్న ఎడారి ప్రాంతాన్ని అల్‌ఖైదాకు సంబంధించిన మిలిటెంట్లు తమ ఆధీనంలో కి తీసుకున్నారు. దీంతో ఫ్రాన్స్‌ సైన్యం రంగంలోకి దిగి వారిని అంతమొందించింది. దీంతో ఉగ్రవాద సంస్థలు మరోసారి పుంజుకుని తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మాలియన్ గ్రామీణ ప్రాంతాల యొక్క విస్తారమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. మాలి సరిహద్దుల్లో ఉన్న బుర్కినాఫాసో, నైగర్‌ దేశాలకు విస్తరించాయి.

Also read :

ఫ్రాన్స్ 2013 నుండి ఈ ప్రాంతం అంతటా వేలాది మంది సైనికులను నిర్వహిస్తోంది. అయితే పాలక మిలిటరీ జుంటాతో సంబంధాలు దెబ్బతిన్నందున మాలి నుండి తన బలగాలను ఉపసంహరించుకుంటామని గత నెలలో ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు