Srinagar Terror Attack : శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి, 11మందికి తీవ్రగాయాలు

జ‌మ్మూ క‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. శ్రీగనర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. జెవాన్ క్యాంప్ వ‌ద్ద పోలీసుల వాహ‌నంపై ఉగ్రవాదులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు.

Srinagar Terror Attack : శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి, 11మందికి తీవ్రగాయాలు

Srinagar Terror Attack Militants Open Fire At Police Bus On Srinagar Outskirts

Updated On : December 13, 2021 / 7:30 PM IST

Srinagar Terror Attack : జ‌మ్మూ క‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. శ్రీగనర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. జెవాన్ క్యాంప్ వ‌ద్ద పోలీసుల వాహ‌నంపై ఉగ్రవాదులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అమరులైనట్టు సమాచారం. మరో 11మంది పోలీసులకు తీవ్రగాయాలయినట్టు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరు పోలీసుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.


తీవ్రంగా గాయపడిన పోలీసులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. జమ్ముకశ్మీర్ సాయుధ దళాలకు చెందిన 9వ బెటాలియన్ పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : First Omicron Death : తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఎక్కడంటే..