First Omicron Death : తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఎక్కడంటే..

వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డేంజర్ బెల్స్ మోగించింది. ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ తో తొలి మరణం నమోదైంది.

First Omicron Death : తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఎక్కడంటే..

Omicron Death

Omicron Death : వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డేంజర్ బెల్స్ మోగించింది. ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ తో తొలి మరణం నమోదైంది. బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ మరణంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు.

వెస్ట్ లండన్‌లోని పాడింగ్‌టన్‌లోని వ్యాక్సిన్ సెంటర్ ను సందర్శించిన ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారంతా ఇక బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆయన కోరారు.

WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

గతంలో కరోనా మహమ్మారి కారణంగా చిగురుటాకులా వణికిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌.. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జనవరి 2022 కల్లా 18 ఏళ్లు పైబడిన వారంతా మూడో డోసు తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ గడవును ఈ నెలాఖరుకు కుదించారు. ఒమిక్రాన్‌ ‘భారీ అలలా ముంచుకొస్తోంది’ అని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన హెచ్చరించారు.

ఒమిక్రాన్‌ ప్రభావంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని బోరిస్‌ అన్నారు. ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. గతంలో చూసిన చేదు అనుభవాలతో ఒమిక్రాన్‌ ఎంత వేగంగా వ్యాపించబోతోందో అంచనా వేయగలమని అన్నారు. బ్రిటన్ లో ప్రతి, రెండు లేదా మూడు రోజులకు కొత్త వేరియంట్‌ కేసులు రెట్టింపవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూకేలో 1,239 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,137కి చేరింది. ఒక్కరోజులోనే 65 శాతం కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. కాస్త తగ్గింది.. అని ఊపిరి పీల్చుకునేలోపు కొత్త వేరియంట్ రూపంలో మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కలవరపెడున్న డెల్టా వేరియంట్‌ సహా తాజా ఒమిక్రాన్‌ కేసులు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు చాలా వరకు దేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.