WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.రోజుకో తరహాలో దగా చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను వాట్సాప్

WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

Whatsapp New Scam

WhatsApp New Scam : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ లేని వారు ఉండరు. చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేదు. దాదాపు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అందులో వాట్సాప్ మస్ట్ గా ఉంటుంది. మేసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే గడిపే వాళ్లూ ఉన్నారు. అంతగా అడిక్ట్ అయిపోయారు మరి. విషయానికి వస్తే.. మీకు వాట్సాప్ అకౌంట్ ఉందా? అయితే బీకేర్ ఫుల్.. అంటోంది.. వాట్సాప్ యాజమాన్యం.

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో తరహాలో దగా చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను వాట్సాప్ మీద పడింది. వాట్సాప్ వేదికగా చీటింగ్ చేస్తున్నారు. అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన వాట్సాప్.. తన యూజర్లను అలర్ట్ చేసింది. సైబర్ క్రిమినల్స్ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది.

Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ.19వేలు పొగొట్టుకొన్న యువతి

ఓ మేసేజ్ వస్తుంది. అందులో ఏదో సమస్య ఉంటుంది. అంతేకాదు ఓ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఉంటుంది. దానికి డబ్బు పంపాలని వేడుకుంటారు. కట్ చేస్తే.. వాటిని నమ్మి డబ్బులు పంపారో ఇక అంతే.. ఆ డబ్బులు తిరిగి రావు.

కుమారుడో, కూతురో మేసేజ్ చేసినట్లు.. ‘హలో మామ్, హలో డాడ్’ అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పంపుతున్నారని వాట్సాప్ తెలిపింది. ” ఇబ్బందుల్లో ఉన్నాం, ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి. ఫోన్ పోయింది. అందుకే వేరే నెంబర్ నుంచి మేసేజ్ చేస్తున్నా. ఈ అకౌంట్ నెంబర్ కి మనీ పంపండి” అని నమ్మిస్తారట. పొరపాటున కానీ, నమ్మి డబ్బులు పంపారో ఇక తిరిగిరావని వాట్సాప్ హెచ్చరించింది.

Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

మీకూ ఇలానే ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. ఆ మెసేజ్ ని నమ్మి మోసపోవద్దు. ముందు అందులో నిజం ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా అలర్ట్ అవ్వండి. తొందరపడి డబ్బులు పంపకండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. వాట్సాప్ యూజర్లు తమ కాంటాక్ట్స్ ని డబుల్ చెక్ చేసుకోవాలని, డబ్బు పంపే ముందు ఆ మేసేజ్ ని వెరిఫై చేసుకోవాలని వాట్సాప్ సూచించింది.