Viral Video: 150 అడుగుల ఎత్తులో రోలర్ కోస్టర్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయిన 32 మంది టూరిస్టులు

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 32 మంది టూరిస్టులు రోలర్ కోస్టర్ ఎక్కారు.

rollercoaster

Japan: రోలర్ కోస్టర్ ఎక్కడమంటే చాలా మందికి ఇష్టం. అలాగే చాలామంది భయపడతారు కూడా. రోలర్ కోస్టర్ పైకి వెళ్లాక అది మధ్యలో ఆగిపోతే ఇంకేమైనా ఉందా? అదీ 150 అడుగుల ఎత్తులో.. రోలర్ కోస్టర్‌లో మనం తలకిందులుగా వేలాడుతున్న సమయంలో?

తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా? జపాన్‌లోని ఒసాకాలోని ఓ థీమ్ పార్క్‌లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 32 మంది టూరిస్టులు రోలర్ కోస్టర్ ఎక్కారు. వారు పై భాగంలో ఉన్న సమయంలో అత్యవసరంగా రోలర్ కోస్టర్‌ను ఆపాల్సి వచ్చింది.

దీంతో పై భాగంలోని టూరిస్టులు అందరూ తలకిందులుగా అలాగే ఉండిపోయారు.. భయంతో వణికిపోయారు. ఆ తర్వాత ఆ 32 మందిని ఎమర్జెన్సీ మెట్ల ద్వారా పార్క్ సిబ్బంది కిందికి తీసుకొచ్చారు.

వారందరినీ కిందకు తీసుకురావడానికి 45 నిమిషాల సమయం పట్టింది. పర్యాటకులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. రోలర్ కోస్టర్ తలెత్తిన సాంకేతిక లోపం వల్ల అది ఆటోమెటిక్‌గా ఆగిపోయిందని తెలిపారు.

Supercomputer 2024 : ఏఐ మనుషుల కంటే తెలివైనదా? 2024లో మానవ మెదడు సామర్థ్యానికి సరిపోయే సూపర్ కంప్యూటర్ వస్తోంది..!