3Y Old Girl Wakeup At Her Funeral: చనిపోయిందని అంత్యక్రియలు చేస్తుండగా లేచిన 3 ఏళ్ల చిన్నారి.. మళ్లీ అంతలోనే..

ఆ మరుసటి రోజే చిన్నారి అంత్యక్రియలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సహా సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో చిన్నారి కనుగుడ్లు తచ్చాడుతున్నట్లు తల్లి గమనించింది. ఇదే విషయాన్ని అక్కడున్న వారికి చెబితే కూతురి మీద ప్రేమతో ఆ తల్లికి అలా కనిపించిందని అనుకున్నారు. అయితే ఇదే దృశ్యాన్ని చిన్నారి తాతమ్మ కూడా గమనించింది. అంతే పరుగుపరుగున అంబులెన్సును పిలవడం, మళ్లీ చిన్నారిని అదే ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిపోయాయి.

3Y Old Girl Wakeup At Her Funeral: మూడేళ్ల చిన్నారి చనిపోయిందని వైద్యులు తేల్చి చెప్పారు. దు:ఖసాగరంలో కుటుంబ సభ్యులంతా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇంతలో శవపేటికలో ఉన్న చిన్నారి కళ్లల్లో కదలికలు.. తల్లి ఆశ్చర్యపోయింది. ఇదే విషయాన్ని అక్కడున్న వారికి చెబితే కూతురి మీద ప్రేమతో ఆ తల్లికి అలా కనిపించిందని అనుకున్నారు. కానీ, తాతమ్మకు కూడా అలాగే కనబడే సరికి.. చిన్నారి ఇంకా ఊపిరితోనే ఉందని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, ఈసారి వాళ్లకు శాశ్వతంగా దు:ఖమే మిగిలింది. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది.

మెక్సికోలో ఆగస్టు 17న జరిగిన సంఘటన ఇది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. విల్లా డె రమోస్‭కు చెందిన కమిలా రోక్సానా మార్టినెజ్ మెండోజా అనే చిన్నారి కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతుందని ఆమె తల్లి మేరీ జేన్ మెండోజా మొదట ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అక్కడి వైద్యం సరిపోకపోవడంతో అదే నగరంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీకి తరలించారు. ఇంతలో చిన్నారికి ఆక్సీజన్ పెట్టండని తల్లి కోరితే.. 10 నిమిషాల పాటు ఆక్సీజన్ పెట్టి.. ఇక చిన్నారిని ప్రాణాలతో లేదని, తీసుకెళ్లవచ్చని వైద్యులు తెలిపారు. చిన్నారి మరణానికి కారణం డీహైడ్రేషన్ అని వారు ప్రకటించారు.

Sanitiser Foils Cheating: రైల్వే ఎగ్జామ్ కోసం తన బొటనవేలి తోలు తొలగించి ఫ్రెండ్‭కు అతికించిన అభ్యర్థి.. ఈ తర్వాత ఏమైందంటే..?

ఆ మరుసటి రోజే చిన్నారి అంత్యక్రియలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సహా సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో చిన్నారి కనుగుడ్లు తచ్చాడుతున్నట్లు తల్లి గమనించింది. ఇదే విషయాన్ని అక్కడున్న వారికి చెబితే కూతురి మీద ప్రేమతో ఆ తల్లికి అలా కనిపించిందని అనుకున్నారు. అయితే ఇదే దృశ్యాన్ని చిన్నారి తాతమ్మ కూడా గమనించింది. అంతే పరుగుపరుగున అంబులెన్సును పిలవడం, మళ్లీ చిన్నారిని అదే ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. కొద్ది గంటల పాటు చికిత్స అనంతరం చిన్నారి నిజంగానే ప్రాణాలు విడిచింది.

తన కూతురు బతికుండగానే చనిపోయిందని చెప్పి, నిజంగానే చంపేసిన వైద్యుల నిర్లక్షానికి సరిపడా శిక్ష వేయాలంటూ తల్లి మేరీ జేన్ మెండోజా కన్నీరు మున్నీరైంది. వైద్యుల పైన తనకేమీ వ్యక్తిగత కక్ష్య సాధింపు లేదని, అయితే మరోసారి ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే సదరు వైద్యులు శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.

PD Act On Raja Singh : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్

ట్రెండింగ్ వార్తలు