Sanitiser Foils Cheating: రైల్వే ఎగ్జామ్ కోసం తన బొటనవేలి తోలు తొలగించి ఫ్రెండ్‭కు అతికించిన అభ్యర్థి.. ఈ తర్వాత ఏమైందంటే..?

మనీశ్ కుమార్, రాజ్యగురు గుప్తలను అరెస్ట్ చేశారు. ఇందులో మనీశ్ కుమార్ బొటన వేలిని కోసుకున్న రైల్వే అభ్యర్థి. రాజ్యగురు స్నేహితుడి కోసం పరీక్ష రాయడానికి సిద్ధమైన త్యాగశీలి. వీరిది బిహార్‭లోని ముంగర్ జిల్లా. వీరిద్దిరూ ఈ మద్యే 12వ తరగతి పూర్తి చేశారట. ఇద్దరికీ అటుఇటుగా 20 ఏళ్లు ఉంటాయని వడోదల అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎం వరోటరియా తెలిపారు

Sanitiser Foils Cheating: రైల్వే ఎగ్జామ్ కోసం తన బొటనవేలి తోలు తొలగించి ఫ్రెండ్‭కు అతికించిన అభ్యర్థి.. ఈ తర్వాత ఏమైందంటే..?

To Clear Railway Exam Aspirant Removes Thumb Skin Puts on Friend's Hand

Sanitiser Foils Cheating: ద్రోణాచార్యుడికి గురుదక్షిణ ఇవ్వడం కోసం ఏకలవ్యుడు బొటనవేలిని కోసుకున్నాడని పుస్తకాల్లో చదివే ఉంటాం. అయితే ఒక వ్యక్తి పరీక్ష కోసం తన బొటన వేలిని కోసుకున్నాడు. వేలు మొత్తాన్ని కత్తించలేదు కానీ, వేలిముద్ర వేయడానికి కావాల్సినంత తోలును పెనపై వేడి చేసి ఊడపీకాడు. అనంతరం తన స్నేహితుడి చేతికి అతికించాడు. ఎలాగైనా సరే.. తన స్నేహితుడు ఈ పరీక్ష రాసి పాసై తనకు ఉద్యోగం సంపాదించి పెడతాడని తన నమ్మకం. కానీ అనుకున్నది ఒకటైతే, జరిగింది మరొకటి. పరీక్ష హాలుకు వెళ్లగానే అసలు విషయం బయట పడింది. ఎగ్జామ్ సూపవర్ వైజర్ సానిటైజర్ పూయగానే అతికించిన తోలు ఊడిపోయి కింద పడింది. గుజరాత్‭లోని వడోదలో జరిగిన ఘటన తాజాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Beti Bachao: కుమార్తెలను కాపాడాలిని చెప్తూ రేపిస్టులను కాపాడుతున్నారు.. బీజేపీపై రాహుల్ ఫైర్

వడోదర పోలీసులు బుధవారం మనీశ్ కుమార్, రాజ్యగురు గుప్తలను అరెస్ట్ చేశారు. ఇందులో మనీశ్ కుమార్ బొటన వేలిని కోసుకున్న రైల్వే అభ్యర్థి. రాజ్యగురు స్నేహితుడి కోసం పరీక్ష రాయడానికి సిద్ధమైన త్యాగశీలి. వీరిది బిహార్‭లోని ముంగర్ జిల్లా. వీరిద్దిరూ ఈ మద్యే 12వ తరగతి పూర్తి చేశారట. ఇద్దరికీ అటుఇటుగా 20 ఏళ్లు ఉంటాయని వడోదల అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎం వరోటరియా తెలిపారు. వడోదరలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఆగస్టు 22న 600 మంది అభ్యర్థుల సామర్థ్యంతో రైల్వే (గ్రూప్ డీ) పరీక్ష నిర్వహించారు. ఆరోజే మనీశ్‭కు బదులు పరీక్ష రాయడానికి వెళ్లిన రాజ్యగురు దొరికిపోయాడు.

Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక వాయిదా.. గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడమే కారణమా?

ఈ విషయమై వరోటరియా మాట్లాడుతూ ‘‘పరీక్ష నిష్పాక్షికంగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆధార్‭లో ఉన్న డేటా ఆధారంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారు. కానీ మనీశ్ కుమార్ డేటా ఎంటర్ కావడం లేదు. అతడి బయోమెట్రిక్ తీసుకోవడంలో డివైస్ ఫెయిల్ అవుతోంది. అప్పటికే సూపర్‭వైజర్‭‭కు అనుమానం కలిగింది. అంతలోనే అతడు తన ఎడమ చేతిని జేబులో పెట్టుకున్నాడు. అనుమానం మరింత బలపడడంతో వేలిపై సానిటైజర్ పూశాడు. అంతే అతికించిన తోలు వేలి నుంచి ఊడి కింద పడింది. మనీశ్ మోసం బయటపడింది’’ అని తెలిపారు. ఇద్దరు నిందితులపై భారత శిక్షా స్మృతిలోని 465, 419, 120-బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వరోటరియా తెలిపారు.