Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక వాయిదా.. గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడమే కారణమా?
సుదీర్ఘ సమయం అనంతరం గాంధీ కుటుంబానికి ఆవలి వ్యక్తి కాంగ్రెస్ అధినేత కాబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అయిన అశోక్ గెహ్లోత్ను పార్టీ అధ్యక్షుడు చేయడానికి గాంధీ కుటుంబం సముఖంగా ఉందని చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఆయన బుధవారం స్పందిస్తూ.. వాస్తవానికి తనతో సోనియా గాంధీ ఇలాంటి విషయాలేవీ మాట్లాడలేదని, మీడియా ద్వారా వింటున్నట్లు తెలిపారు.

The election for Congress President is likely to be postponed for a few weeks
Congress President Election: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక మరికొద్ది వారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ 20లోపే ఎన్నిక పూర్తవుతుందని పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల మరిన్ని రోజుల సమయం పట్టొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఇది వరకే పార్టీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఆగస్టు 21 నుంచే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ, ఈ తేదీ ముగిసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఈ విషయమై పార్టీలో కదలిక లేదు. అధ్యక్ష ఎన్నికకు మరింత సమయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కానట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పదవికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం.. పార్టీలో అధ్యక్షుడి పదవికి గాంధీయేతరులు ఎవరి పోటీ పడతారు, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందనే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. సుదీర్ఘ సమయం అనంతరం గాంధీ కుటుంబానికి ఆవలి వ్యక్తి కాంగ్రెస్ అధినేత కాబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అయిన అశోక్ గెహ్లోత్ను పార్టీ అధ్యక్షుడు చేయడానికి గాంధీ కుటుంబం సముఖంగా ఉందని చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఆయన బుధవారం స్పందిస్తూ.. వాస్తవానికి తనతో సోనియా గాంధీ ఇలాంటి విషయాలేవీ మాట్లాడలేదని, మీడియా ద్వారా వింటున్నట్లు తెలిపారు.