Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈసీ షాక్..! ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు లేఖ

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఈమేరకు నివేదిక సమర్పించింది

Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈసీ షాక్..! ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు లేఖ

Jharkhand CM Hemant Soren

Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈసీ (భారత ఎన్నికల సంఘం) షాకిచ్చింది. సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ కు సూచించినట్లు తెలిసింది. అయితే ఈసీ నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్ పై గవర్నర్ చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై హేమంత్ సోరెన్ స్పందించారు. ఎమ్మెల్యేగా అనర్హతను సిఫార్సు చేస్తూ ఎన్నికల కమిషన్ సూచించినట్లు మీడియా, బీజేపీ ప్రకటనల ద్వారానే తనకు తెలిసిందని, ఇంకా ఎటువంటి సమాచారం అధికారికంగా తనవద్ద లేదని అన్నారు.

Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం నివాసంపై ఈడీ దాడులు

ముఖ్యమంత్రి సోరెన్ మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల ప్రకారం అతనిపై అనర్హత వేటు వేయాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్ రమేష్ బైస్కును కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం అవసరమైన విధంగా గవర్నర్ దానిని పోల్ ఫ్యానెల్ కు పంపారు. ఇలాంటి విషయాల్లో పాక్షిక న్యాయవ్యవస్థగా పనిచేసే ఈసీ అభిప్రాయానికి గవర్నర్ కట్టుబడి ఉంటారని చట్టం చెబుతోంది.

Jharkhand CM : సీఎం భార్యతో సహా.. 15 మందికి కరోనా

అయితే బీజేపీ అభ్యర్థనపై ఈసీ పలుసార్లు ఇరు పక్షాలను విచారించింది. సోమవారం ఈ విచారణ ముగిసింది. మంగళవారం గవర్నర్ రమేష్ బైస్కుకు ఈసీ తమ అభిప్రాయాన్ని పంపినట్లు సమాచారం. అయితే ఈసీ లేఖ రాజ్‌భవన్‌కు చేరిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం ట్వీట్ చేశారు. ఈసీ పంపిన లేఖలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని పేర్కొనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టమైన అధికారిక ప్రకటన రాలేదు.