PD Act On Raja Singh : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. గురువారం మ‌ధ్యాహ్నం రాజా సింగ్‌ను ఆయ‌న ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నేరుగా నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు.

PD Act On Raja Singh : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్

PD Act On Raja Singh : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. గురువారం మ‌ధ్యాహ్నం రాజా సింగ్‌ను ఆయ‌న ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నేరుగా నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో రాజా సింగ్‌కు న్యాయ‌మూర్తి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు.  దీంతో పోలీసులు రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకి తరలించారు.

Asaduddin Owaisi: రాష్ట్రాన్ని ఆహుతి చేద్దామనుకున్నారా.. బీజేపీపై అసదుద్దీన్ ఫైర్

రాజాసింగ్ అరెస్ట్‌, కోర్టుకు త‌ర‌లింపు సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్న‌తాధికారులు భారీ బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. బుధ‌వారం నాడు చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా రాజాసింగ్‌కు 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాక పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాజాసింగ్‌ను ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లిస్తున్న‌ట్లుగా చెప్పిన పోలీసులు… ఆ త‌ర్వాత వ్యూహం మార్చి నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు.

MLa Raja Singh : బీజేపీ నన్ను వదులుకోదు..నేను బీజేపీని వదులుకోను..సస్పెన్షన్ పై వివరణ ఇస్తా

ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిసారి. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఇటీవలే వరుస ఫిర్యాదులు, కేసులు వచ్చాయి. ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేసులు నమోదయ్యాయి. ఓ యూట్యూబ్ చానల్‌లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం వారు ఇటీవలే వరుస ఆందోళనలు నిరసనలతో హోరెత్తించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw