Asaduddin Owaisi: రాష్ట్రాన్ని ఆహుతి చేద్దామనుకున్నారా.. బీజేపీపై అసదుద్దీన్ ఫైర్

హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.

Asaduddin Owaisi: రాష్ట్రాన్ని ఆహుతి చేద్దామనుకున్నారా.. బీజేపీపై అసదుద్దీన్ ఫైర్

Updated On : August 25, 2022 / 4:25 PM IST

Asaduddin Owaisi: హైదరాబాద్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్ఐఎమ్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీ తీరును తప్పుబట్టారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ల ద్వారా బీజేపీపై విమర్శలు చేశారు. తెలుగులో ఈ ట్వీట్లు చేయడం విశేషం.

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు

‘‘ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళ పరిస్థతి ఏంటి? రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకాణాలు, పాఠశాలలు మూయించి, ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా? అల్లా దయతో ఇవన్నీ జరగకూడదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దాం’’ అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని తెలుగుతోపాటు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలో కూడా ట్వీట్ చేశారు.

Liger Locks OTT Partner: ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ ఫిక్స్..!

ఇక బుధవారం రాత్రి కూడా ఇదే అంశంపై పలు ట్వీట్లు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఘర్షణలకు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే కారణం. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. అందరూ శాంతియుతంగా ఉండేందుకు సహకరించాలి. హైదరాబాద్ మా జన్మస్థలం. ఇలాంటి చోట మత ఘర్షణలకు తావులేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు.