అమెరికాలోని సిన్‌సినాటిలో లేక్ ఫ్రంట్ దగ్గర వెస్ట్ చెస్టర్ అపార్ట్‌మెంట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ కాల్పుల ఘటనలో చనిపోయారు. చనిపోయిన వ్యక్తులలో ముగ్గురు మహిళలు కాగా ఒకరు పురుషుడుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన కుటుంబం మొత్తం సిక్కు ఫ్యామిలీ కాగా చనిపోయిన వ్యక్తులలో హకికాట్ పనాగ్ ఓకరు కాగా పనాగ్ భార్య, పనాగ్ కూతురు, పనాగ్ మరదలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే కాల్పుల ఘటనకు సంబంధించి పలువురు అనుమానితులను అరెస్ట్ చేశామని, ఘటనలకు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు.