Dubai Shopping Festival : దుబాయ్‌లో షాపింగ్​ ఫెస్టివల్ .. 11 కిలోల బంగారం గెలుచుకున్న భారతీయులు

దుబాయ్ లో షాపింగ్ చేసిన భారతీయులకు అదృష్టం వరించింది. బంగారం వర్షం కురిసింది.దుబాయ్ లో షాపింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్న భారత ప్రవాసులు కిలోల కొద్దీ బంగారాన్ని బహుమతిగా గెలుచుకుంటున్నారు. లాటరీ టికెట్లు కొన్న వారిలో 44 మంది విజేతలు అయ్యారు. వారికి 11 కిలోల బంగారం బహుమతిగా లభించగా వీరిలో 27 మంది భారతీయులే కావటం విశేషం.

Dubai Shopping Festival

Dubai Shopping Fest : నక్కతోక తొక్కితే అదృష్టం వరిస్తుందంటారు. ఇది నిజమో కాదో తెలీదు గానీ..దుబాయ్ లో షాపింగ్ చేసిన భారతీయులకు మాత్రం నిజ్జంగా అదృష్టం వరించింది. వారి ఇంట బంగారం వర్షం కురిసింది.దుబాయ్ లో షాపింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్న భారత ప్రవాసులు కిలోల కొద్దీ బంగారాన్ని బహుమతిగా గెలుచుకుంటున్నారు. 2022 డిసెంబర్ 15న ప్రారంభమైన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో షాపింగ్ చేసి లాటరీ కొన్నవారిని అదృష్టం వరించింది. వారి ఇంట పసిడి వర్షం కురిసింది. లాటరీ టికెట్లు కొన్న వారిలో 44 మంది విజేతలు అయ్యారు. వారికి 11 కిలోల బంగారం బహుమతిగా లభించగా వీరిలో 27 మంది భారతీయులే కావటం విశేషం. ఈ 44మంది 11 కిలోల బంగారం గెలుపొందగా ..ఒక్కొక్కరు పావు కిలో చొప్పున బంగారం గెలుచుకున్నారు. ఈ 44మందిలో 27మంది ప్రవాస భారతీయులే ఉన్నారు.

అంతేకాదు ఈ అవకాశం జనవరి (2023) 29 వరకు ఉంది. ఈ షాపింగ్ ఫెస్టివల్ 29 వరకు కొనసాగటంతో మరింత మంది బంగారాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ గోల్డ్ లక్కీ డ్రాలో పేరు నమోదు చేసుకొని బంగారం గెలుచుకోవాలనుకునేవారు షాపింగ్ ఫెస్టివల్ లో దుబాయ్ కరెన్సీలో 500 దిర్హమ్స్ అంటే భారత కరెన్సీ లో రూ.11,182 రూపాయలు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు గోల్డ్ లాటరీకి అర్హులు అవుతారు. ఈ అవకాశం డిసెంబర్ 15, 2022 నుండి జనవరి 29, 2023 వరకు ఉంటుంది. అంటే మరింతమంది బంగారాన్ని గెలుచుకునే అకాశాన్ని కల్పించింది ఈ ఫెస్టివల్.

దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వారసత్వాన్ని కాపాడటానికి ..దుబాయ్ జువెలరీ గ్రూప్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. జనవరి 29, 2023 వరకు జరిగే ఈ ఫెస్ట్ లో భారీ బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 46 రోజుల పాటు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో అద్భుతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తోంది. షాపింగ్ తో పాటు అనేక ప్రదర్శనలు,కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులను ఆకట్టుకుంటోంది ఈ ఫెస్టివల్.

కాగా..బంగారాన్ని గెలుపొందినవారిలో ప్రవాస భారతీయులు తరువాత పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, యూఏఈ వాసులు కూడా ఉన్నారు. వీరందరూ ఒక్కొక్కరు పావు కిలో చొప్పున బంగార గెలుచుకున్నారు. ఇంకా జనవరి 29వ తేదీ వరకు షాపర్స్‌కు మరింత పసిడిని గెలుచుకునే అవకాశం ఉంది. 245 భాగస్వామ్య అవుట్‌లెట్‌లలో డీఎస్ఎప్ మిగిలిన రోజులలో షాపర్స్ ఇంకా ఎక్కువ బంగారాన్ని గెలుచుకోవచ్చు. దీనికోసం షాపర్స్ లాటరీలో ప్రవేశించడంతో పాటు ఒక్కొక్కరు పావు కిలో బంగారాన్ని గెలుచుకోవడానికి ఆభరణాల కొనుగోలు కోసం 500 దిర్హమ్స్ అంటే భారత కరెన్సీలో 11 వేల 182 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ద్వారా నిర్వహించబడుతున్న డీఎస్‌ఎఫ్ 46రోజుల ఈ ఎడిషన్ నివాసితులు, సందర్శకులందరికీ అద్భుతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తోంది. ఇక ఈ ఫెస్ట్ ను సందర్శకులకు థియేట్రికల్ ప్రదర్శనలు, కమ్యూనిటీ మార్కెట్‌లు, జానపద మరియు వారసత్వ ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. అంతేకాదు సరదా ఉత్సవాలు, కుటుంబాలు, పిల్లల కోసం అనేక ఇతర ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తూ ఆకర్షిస్తోంది. వాటితో పాటు అద్భుతమైన వినోదాన్ని కలిగిస్తోంది.