Extraterrestrial Particles : భూమిపై 5వేల టన్నుల గ్రహాంతర ధూళికణాలు ప్రతి ఏడాది వర్షంలా పడుతున్నాయి

సౌర వ్యవస్థ దుమ్మధూళితో నిండి ఉంటుంది. గ్రహాల నుంచి కొంత దుమ్ము వచ్చి చేరుతుంది. గ్రహశకలాలు, తోకచుక్కల నుంచి దుమ్ము సౌర వ్యవస్థలో పేరుకుపోతుంది.

Extraterrestrial Particles : సౌర వ్యవస్థ దుమ్మధూళితో నిండి ఉంటుంది. గ్రహాల నుంచి కొంత దుమ్ము వచ్చి చేరుతుంది. గ్రహశకలాలు, తోకచుక్కల నుంచి దుమ్ము సౌర వ్యవస్థలో పేరుకుపోతుంది. ఎప్పుడైతే ఈ కక్ష్యలో భూమి వెళ్తుందో ఆ సమయంలో దుమ్మును బయటకు ఊడ్చేస్తుంది. అప్పుడు అది ఉల్కపాతం మాదిరిగా ఏర్పడి చిన్నపాటి గ్రహశకలాలు భూమి ఉపరితలంపైకి జారిపడుతుంటాయి. ఇలా ప్రతి ఏడాదిలో భూమిపైకి వర్షంలా ఎంతవరకు గ్రహాంతర కణాలు జారిపడుతున్నాయో లెక్కించేందుకు 20ఏళ్ల పాటు అంతరిక్ష పరిశోధకులు అధ్యయనం చేశారు.

వారి అంచనా ప్రకారం.. 5.2 మిలియన్ కిలోగ్రామలు (11.5 మిలియన్ పౌండ్లు) చిన్నపాటి గ్రహాశకలాలుగా తేల్చారు. అంటే.. ప్రతి ఏడాదిలో భూమిపైకి వర్షంలా పడే గ్రహాంతర కణాలు రెండున్నర అంతరిక్ష నౌక పరిమాణానికి సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. అతిపెద్ద గ్రహాశకలాలు 10వేల కిలోమీటర్లు (22వేల పౌండ్లు) అంతరిక్షం నుంచి భూమి ఉపరితలానికి చేరుకుంటున్నాయి. వాస్తవానికి ఈ గ్రహాంతర కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. దాదాపు 30 నుంచి 200 వరకు చిన్నపరిమాణంలో ఉంటాయి. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఈ గ్రహశకలాలు పడుతుంటాయి.

ఇక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో మంచు ఏర్పడుతుంది. ఫలితంగా ఎలాంటి దుమ్ము ధూళి కణాలు పడినా సులభంగా గుర్తించి సేకరించవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. అందులోనూ బృహస్పతి కుటుంబానికి చెందిన తోకచుక్కల నుంచే ఎక్కువగా రాలి పడుతుంటాయట. అంతరిక్షం నుంచి జారిపడే గ్రహాంతర ధూళికణాల్లో 80శాతం చిన్నగ్రహాశకలాలు తోకచుక్కల నుంచే వస్తుంటాయని పరిశోధకులు గుర్తించారు. మిగిలిన 20శాతం ధూళి కణాలు గ్రహాశకలాల నుంచి పడుతుంటాయి.

ట్రెండింగ్ వార్తలు