Itjp Complains Against Gotabaya In Singapore
ITJP complains against Gotabaya in Singapore : స్వదేశం నుంచి సొంత ప్రజల నుంచి తప్పించుకుని ఏదేశమెళ్లినా గొటబాయకు తిప్పలు తప్పటంలేదు. కుటుంబం సహా పారిపోయినా నిరసనలు వెన్నాడుతునే ఉన్నాయి. తీవ్ర సంక్షోభంతో అట్టుడుకుతున్న శ్రీలంక నుంచి..నిరసనకారుల నుంచి తప్పించుకుని రాత్రికి రాత్రే మాల్దీవులకు పారిపోయిన లంక్ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అక్కడ కూడా నిరసనలు తప్పలేదు.దీంతో అక్కడి నుంచి సింగపూర్ కు చెక్కేశారు గొటబాయ. కానీ అక్కడ కూడా ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది. ఇలా గొటబాయ ఎక్కడకు వెళ్లినా మనశ్శాంతి లేకుండాపోయింది. మాల్దీవుల్లో ఉన్న లంక వాసులు గొటబాయను అక్కడ నుంచి పంపించివేయాలని ప్లకార్డులతో నిరసలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలా ఆయన సింగపూర్ కు వెళ్లిపోయారు. ఈక్రమంలో అక్కడ కూడా ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Also read : Sri Lanka: వారంలో పరిస్థితులు చక్కదిద్దాలని శ్రీలంక కొత్త అధ్యక్షుడు విక్రమసింఘే నిర్ణయం
దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్ (ITJP) అనే పౌర హక్కుల సంఘం గొటబాయపై సింగపూర్ అటార్నీ జనరల్ కు భారీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుల సారాంశం ఎంతగా ఉందంటే..ఏకండా 63పేజీలు ఉంది. 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం చోటుచేసుకున్న సమయంలో గొటబాయ రక్షణ మంత్రిగా ఉన్నారని..తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ITJP సింగపూర్ అటార్నీ జనరల్ కు 63 పేజీల భారీ ఫిర్యాదును సమర్పించింది.
అంతర్యుద్ధం వేళ హత్యలు, ఉరితీతలు, అత్యాచారాలు, నిర్బంధాలు, మానసిక వేధింపులు, దాడులు వంటి హేయమైన చర్యలకు గొటబాయ పాల్పడ్డారంటూ ఫిర్యాదులో వివరించింది. ఇవన్నీ జెనీవా ఒప్పందాలకు విరుద్ధమని..గొటబాయ అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను అతిక్రమించారని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా వివరించారు.
Also read : sri Lanka: గొటబాయ రాజపక్సకు 14 రోజుల స్వల్పకాలిక పర్యటన పాస్ మాత్రమే ఇచ్చాం: సింగపూర్
అంతేకాదు..గొటబాయ సైన్యంలో కమాండర్ గా ఉన్న సమయంలో 700 మంది ఆచూకీ లేకుండా పోయారని..రక్షణ మంత్రి అయ్యాక ఆ నేరాలు మరింతగా పెరిగాయని ఐటీజేపీ తన ఫిర్యాదులో వెల్లడించింది. అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి ప్రజలపై దాడులకు పురిగొల్పేవారని పేర్కొంది. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం ఇలాంటి అనేక అంశాలతో ముడిపడి ఉందని..ఇవన్నీ తీవ్రమైన అంతర్జాతీయ నేరాలు అని ఐటీజేపీ స్పష్టం చేసింది. అందుకే గొటబాయను అరెస్ట్ చేయాలని, నేరాలపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.