sri Lanka: గొట‌బాయ రాజ‌ప‌క్సకు 14 రోజుల స్వ‌ల్ప‌కాలిక ప‌ర్య‌ట‌న పాస్ మాత్ర‌మే ఇచ్చాం: సింగ‌పూర్

శ్రీ‌లంక నుంచి వ‌చ్చే ప‌ర్యాటకుల‌కు సాధార‌ణంగా తాము 30 రోజుల ఎస్టీవీపీ ఇస్తామ‌ని చెప్పారు. అయితే, ఆ కాల‌ప‌రిమితిని పొడిగించుకోవాల‌నుకునే వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఆయా ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోద‌ముద్ర వేస్తామ‌ని చెప్పారు. కాగా, శ్రీలంకలో ఆందోళ‌న‌లు త‌గ్గ‌లేదు.

sri Lanka: గొట‌బాయ రాజ‌ప‌క్సకు 14 రోజుల స్వ‌ల్ప‌కాలిక ప‌ర్య‌ట‌న పాస్ మాత్ర‌మే ఇచ్చాం: సింగ‌పూర్

Gotabaya Rajapaksa

sri Lanka: శ్రీ‌లంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్సకు త‌మ దేశం 14 రోజుల స్వ‌ల్ప‌కాలిక ప‌ర్య‌ట‌న పాస్ (ఎస్టీవీపీ) మాత్ర‌మే ఇచ్చింద‌ని సింగ‌పూర్ తెలిపింది. శ్రీ‌లంక‌లో ఆర్థిక, ఆహార సంక్షోభంతో ఆందోళ‌న‌కారులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెల‌ప‌డంతో గొట‌బాయ రాజ‌ప‌క్స మొద‌ట మాల్దీవుల‌కి, ఆ త‌ర్వాత సింగ‌పూర్‌కు పారిపోయిన విష‌యం తెలిసిందే. తాము ఆయ‌న‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌లేద‌ని సింగ‌పూర్ ఇంతకు ముందే ప్ర‌క‌టించింది. అలాగే, ఆశ్ర‌యం ఇవ్వాల‌ని రాజ‌ప‌క్స కూడా అడ‌గ‌లేద‌ని తెలిపింది. ఈ విష‌యంపై సింగ‌పూర్ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేసి మ‌రిన్ని వివ‌రాలు తెలిపారు.

శ్రీ‌లంక నుంచి వ‌చ్చే ప‌ర్యాటకుల‌కు సాధార‌ణంగా తాము 30 రోజుల ఎస్టీవీపీ ఇస్తామ‌ని చెప్పారు. అయితే, ఆ కాల‌ప‌రిమితిని పొడిగించుకోవాల‌నుకునే వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఆయా ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోద‌ముద్ర వేస్తామ‌ని చెప్పారు. కాగా, శ్రీలంకలో ఆందోళ‌న‌లు త‌గ్గ‌లేదు. దీంతో గొట‌బాయ రాజ‌ప‌క్స తిరిగి స్వ‌దేశానికి వెళ్ళే అవ‌కాశాలు లేవు. శ్రీ‌లంక‌లో సంక్షోభం కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లకు ఆహారం దొర‌క‌డ‌మే గ‌గ‌న‌మైపోయింది. సింగ‌పూర్‌లోని శ్రీలంక ప్ర‌జ‌లు ఒక‌పూట‌ ఆహారం తిన‌కుండా డ‌బ్బును దాచుకుని త‌మ దేశంలోని కుటుంబ స‌భ్యుల‌కు పంపుతున్నారు.

Maharashtra: శివ‌సేనలో చీలిక‌లు రావ‌డానికి సంజ‌య్ రౌతే కార‌ణం: రామ్‌దాస్‌ అథ‌వాలే