Maharashtra: శివసేనలో చీలికలు రావడానికి సంజయ్ రౌతే కారణం: రామ్‌దాస్ అథవాలే
''శివసేనలో చీలికలు రావడానికి కారణం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కాదు. ఆ పార్టీని చీల్చింది సంజయ్ రౌత్. ఆయన వల్లే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత శివసేన-ఎన్సీపీ కలవకపోతే రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి'' అని రామ్‌దాస్ అథవాలే చెప్పారు.

Ramdas Athawale
Maharashtra: శివసేనలో చీలికలు రావడానికి ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌతే కారణమని కేంద్ర సహాయ మంత్రి రామ్‌రాద్ అథవాలే అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”శివసేనలో చీలికలు రావడానికి కారణం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కాదు. ఆ పార్టీని చీల్చింది సంజయ్ రౌత్. ఆయన వల్లే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత శివసేన-ఎన్సీపీ కలవకపోతే రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి” అని రామ్‌దాస్ అథవాలే చెప్పారు.
కాగా, శివసేను క్రమంగా విడగొట్టింది ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అని ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి రామ్దాస్ కదామ్ అన్నారు. అలాగే, శివసేనకు రాజీనామా చేస్తున్నానని ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన సమర్థించారు. 2019లో కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దని తాను ఉద్ధవ్ ఠాక్రేను కోరానని, ఆయన వినిపించుకోలేదని చెప్పారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలోనే శివసేనలో చీలికలు రావడానికి ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌతే కారణమని రామ్‌రాద్ అథవాలే అన్నారు.
Presidential Election: నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఫలితాలు