Presidential Election: నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఫ‌లితాలు

నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఉద‌యం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ‌ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.

Presidential Election: నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఫ‌లితాలు

Yaswath And Murmu

Presidential Election: నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఉద‌యం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ‌ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు, అనంత‌రం రాష్ట్రాల వారీగా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఒకసారి, 20 రాష్ట్రాలు పూర్తయిన తరువాత మరోసారి ఫలితాల సరళిని తెలపనున్నారు.

ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. 10,86,431 ఓట్ల ఎలక్టోరల్ కాలేజీలో మూడింట రెండొంతుల మార్కును ముర్ము దాటుతార‌ని బీజేపీ అంచనా. జూలై 18న జ‌రిగిన‌ రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియ‌నుంది. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.

NASA: ప్లూటో యొక్క అద్భుతమైన రెయిన్‌బో ఇమేజ్‌ను షేర్ చేసిన నాసా