New Caledonia Earthquake : ఫ్రాన్స్ న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake Tsunami Warnings : ఫ్రాన్స్ భూ భాగమైన న్యూ కలెడోనియాలో భారీ భూకంపం సంభవించింది. లాయల్టీ ఐలాండ్స్ కు ఆగ్నేయంగా శుక్రవారం భారీగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు.

America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు

అయితే, ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియా, ఫిజీ, వనాటు ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు