Lake Berryessa Video: సరస్సులో నీటిని మింగేస్తున్న రాకాసి రంద్రం: ఎక్కడంటే?

"ఒక పెద్ద సరస్సులో ఏర్పడిన భారీ రంద్రం అందులోని నీటి మొతాన్ని మింగేస్తుంది". ఇది ఆ రంద్రాన్ని చూసిన వారందరు ఇలాగే భ్రమపడుతున్నారు. అయితే అసలు విషయం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు

California

Lake Berryessa: “ఒక పెద్ద సరస్సులో ఏర్పడిన భారీ రంద్రం అందులోని నీటి మొతాన్ని మింగేస్తుంది”. ఇది ఆ రంద్రాన్ని చూసిన వారందరు ఇలాగే భ్రమపడుతున్నారు. అయితే అసలు విషయం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు. కాలిఫోర్నియాలోని నాపా కౌంటీలో అతిపెద్ద సరస్సు అయిన లేక్ బెర్రియెస్సా జలాశయంలో 75 అడుగుల వెడల్పు గల రంధ్రం తెరుచుకుంది. అయితే చూసే వారికి మాత్రం..భూమికి రంధ్రం పడి సరస్సులో నీరు మొత్తం మాయం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. “నరకానికి పోయే దారి” అంటూ స్థానికులు పిలుచుకుంటున్నారు. సరస్సులోని నీరు సుడిగుండం రంద్రం ద్వారా తరలివెళ్ళిపోతున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని బెర్రియెస్సా సరస్సులో ఏర్పడిన ఈ సుడిగుండం గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

Also read:Hindu God Idols: రూ.12 కోట్ల విలువ చేసే 600 ఏళ్ల నాటి హిందూ దేవతల విగ్రహాలు స్వాధీనం

వాస్తవానికి, జలాశయం యొక్క నీటి మట్టాన్ని నియంత్రించడానికి 1950లలో ఇంజనీర్లు ఈ రంద్రాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా చెప్పుకునే కాలిఫోర్నియా బెర్రియెస్సా సరస్సులో ఈ మోంటిసెల్లో ఆనకట్టను నిర్మించారు. రిజర్వాయర్ లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటే అదనపు నీరు ఈ డ్రైనేజీ రంధ్రం ద్వారా దారి మళ్లిస్తున్నారు. అయితే చాలా కలం తరువాత అక్కడి అధికారులు ఈ రంద్రాన్ని తెరిచారు. దీంతో అది చూస్తున్న ప్రజలు సరస్సులో నీరు రంద్రం ద్వారా భూమిలోకి ఇంకిపోతుందని భావిస్తున్నారు.

Also read:Tunisia Ship : ట్యునీషియా తీరంలో మునిగిన 750 టన్నుల డీజిల్‌ ట్యాంకర్ నౌక..

గతంలో, 2017, 2019లో కాలిఫోర్నియాలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఈ రంద్రం తెరుచుకుంది. బెల్ మౌత్ అని పిలువబడే ఈ డ్రైనేజీ రంధ్రం, ఆనకట్ట నుండి నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. సరస్సు ఇరువైపులా నీటి నియంత్రణ కోసం నిర్మించే సాంప్రదాయ బద్దమైన గొట్టాలను ఇక్కడ నెలకొల్పడం సాధ్యపడదని గ్రహించిన అప్పటి ఇంజినీర్లు ఇలా ప్రత్యామ్న్యాయం ఏర్పాటు చేశారు. దీంతో ఇదో వింతగా ప్రసిద్ధి చెందింది.