Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్

హెడ్ స్టాండ్ టెక్నిక్ అంత ఈజీ కాదు. తలకిందులుగా నిల్చొని ఉండాలంటే చాలా ఏళ్లు ప్రాక్టీస్ చేయాలి. రెండు కాళ్లు గాల్లోకి లేపేసి తల మాత్రమే కింద ఉంచి బ్యాలెన్స్ చేయడం కష్టమే కదా.

 

 

Guinness World Record: హెడ్ స్టాండ్ టెక్నిక్ అంత ఈజీ కాదు. తలకిందులుగా నిల్చొని ఉండాలంటే చాలా ఏళ్లు ప్రాక్టీస్ చేయాలి. రెండు కాళ్లు గాల్లోకి లేపేసి తల మాత్రమే కింద ఉంచి బ్యాలెన్స్ చేయడం కష్టమే కదా.

ఈ టెక్నిక్‌ను చాలా పద్ధతుల్లో ప్రయోగిస్తారు. యోగా, జిమ్నాస్టిక్స్, ఎరోబిక్స్, డ్యాన్సింగ్ లాంటి వాటిల్లో వాడుతుంటారు. ఒకవేళ ఈ హెడ్ స్టాండ్ పొజిషన్ సరిగా లేకపోతే తలకు గానీ, మెడకు గానీ తీవ్రమైన గాయాలవుతాయి.

దీనిని చాలా వరకూ ప్రొఫెషనల్స్, యువత మాత్రమే ప్రాక్టీస్ చేస్తుంటారు. 60ఏళ్లు పైబడ్డ వారు ఇది చేయడం చాలా అరుదు.

Read Also: ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. గిన్నీస్ బుక్‌లో చోటు

కెనడాలోని ఓ 75ఏళ్ల వ్యక్తి హెడ్ స్టాండ్ సక్సెస్‌ఫుల్‌గా చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేశాడు. టానియో హెలే అధికారికంగా హెడ్ స్టాండ్ ఫీట్ చేసిన ప్రపంచంలోనే వృద్ధుడిగా పేరు తెచ్చుకున్నాడు. 75 సంవత్సరాల 33రోజుల వయస్సున్న టానియో 2021 అక్టోబర్ 16న ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.

తన కుటుంబానికి ఇన్‌స్పిరేషన్ గా ఉండటానికే కాకుండా ఫిజికల్ ఛాలెంజెస్ ఏ వయస్సులోనైనా చేయొచ్చని నిరూపించడానికే ఇలా చేశానని చెప్తున్నాడు. “నా స్నేహితులంతా నేను చాలా స్ట్రాంగ్ అని ఫీలవుతుంటారు. కానీ, నా కుటుంబం నాకు గాయాలవుతాయేమోనని భయపడుతుండేవారు” అని హెలో అంటున్నాడు.

“నా తండ్రి చేసే ఫీట్లకు చూసిన వాళ్లంతా నోరెళ్లపెట్టేవారు” అని హెలో కూతురు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు