Face Mask: ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. గిన్నీస్ బుక్‌లో చోటు

 తైవాన్ కు చెందిన మెడికల్ సప్లై కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. అతిపెద్ద సర్జికల్ తయారుచేసి గతంలోని మాస్క్ సైజ్ కంటే చాలా పెద్ద స్థాయిలో మాస్క్ ను సిద్దంచేసింది.

Face Mask: ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. గిన్నీస్ బుక్‌లో చోటు

Taiwan

Face Mask: తైవాన్ కు చెందిన మెడికల్ సప్లై కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. అతిపెద్ద సర్జికల్ తయారుచేసి గతంలోని మాస్క్ సైజ్ కంటే చాలా పెద్ద స్థాయిలో మాస్క్ ను సిద్దంచేసింది. 27 అడుగల 3అంగుళాల పొడవు, 15 అడుగుల 9అంగుళాల వెడల్పు ఉంది ఆ మాస్క్ పరిమాణం.

ద మోటెక్స్ హెల్త్‌కేర్ కార్ప్.. ఈ అతిపెద్ద మాస్క్ ను ఆవిష్కరించి.. డైమండ్ షేప్‌లో ఉన్న దాని ఆకారంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందని కంపెనీ వెల్లడించింది. చాంగువా దేశంలోని మోటెక్స్ మాస్క్ క్రియేటివ్ హౌజ్ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి ఈవెంట్ ను వీడియో చాట్ ద్వారా లండన్ నుంచి వీక్షించి మాస్క్ ను కన్ఫామ్ చేసుకున్నారు. సాధారణ మాస్క్ కంటే 50రెట్లు పెద్దదైన సర్జికల్ మాస్క్ ను ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తించారు.

Read Also : అప్పుడు మాస్క్‌‌లు, ఇప్పుడు హోం క్వారంటైన్‌‌కు గుడ్ బై

కొవిడ్ 19 మహమ్మారి సమయంలో అవగాహనలో భాగంగానే 2020 తొలి నాళ్లల్లో మాస్క్ తయారీ చేయాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించి కంపెనీ యాజమాన్యం.